ద్వేషాన్ని తిరస్కరించండి,అభివృద్ధికి ఓటేయండి: కర్ణాటక ఓటర్లకు ఎమ్మెల్సీ కవిత పిలుపు
కర్ణాటక శాసనసభకు ఈ రోజు ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ లో వందేళ్ల వృద్దుడు ఓటు హక్కును వినియోగించుకొని యువతకు స్పూర్తిగా నిలిచాడు. కర్ణాటక ఎన్నికల పోలింగ్ లో రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఈ సారి కర్ణాటక ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు ప్రముఖులు పిలుపునిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు కీలకమైన ఆయుధమని, అటువంటి ఓటు హక్కును యువత ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఇప్పటికే పలువురు పిలుపునిచ్చారు.ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కర్ణాటక ఎన్నికలపై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.

కర్ణాటక ప్రజలు ఈ ఎన్నికలలో ద్వేషాన్ని తిరస్కరించండి, అభివృద్ధికి ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు. ప్రజల,సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికలలో ఓటు వేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్వీట్ లో కోరారు.ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజల మధ్య మత విద్వేషాలు రగులుస్తున్న బీజేపీని తిరస్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ ట్వీట్ చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగానే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కర్ణాటక ఎన్నికలలో అభివృద్ధికి ఓటేయాలని పిలుపునివ్వడం, ద్వేషాన్ని తిరస్కరించాలని కోరడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ఎన్నికలలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్ణాటక పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు, ఎన్నికలఅధికారులు.
5 కోట్ల 31 లక్షల పైచిలుకు ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హోరాహోరీగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల పోరులో ఈవీఎంలో పోటీ చేసిన అభ్యర్థుల భవిష్యత్తు నిక్షిప్తం అవుతుంది. ఈ ఎన్నికలు ఎవరికి విజయాన్ని చేకూరుస్తాయనేది మాత్రం అందరిలోనూ ఉత్కంఠకు కారణంగా మారింది. ఈ ఫలితాల ప్రభావం 2024 లోక్ సభ ఎన్నికలపై ఉంటుదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications