• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థిని లోదుస్తుల తొలగింపు.. తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు; అసలేం జరిగిందంటే!!

|
Google Oneindia TeluguNews

నీట్ పరీక్ష లో డ్రెస్ కోడ్ అంశం చాలా కాలంగా వివాదాస్పదంగానే ఉంది. ఇక తాజాగా నీట్ పరీక్ష కేంద్రంలో డ్రెస్ కోడ్ పేరుతో ఓ విద్యార్థిని లోదుస్తులను బలవంతంగా తొలగించిన ఘటనపై ఫిర్యాదు చెయ్యటంతో మరోమారు వివాదం తెరమీదకు వచ్చింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలలో కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరుకావడానికి ముందు ఒక బాలిక లోదుస్తులను బలవంతంగా తొలగించాలంటూ ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించిన ఘటన చోటు చేసుకుంది.

నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థిని ఇన్నర్ వేర్ తొలగించిన ఘటనపై కేసు

నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థిని ఇన్నర్ వేర్ తొలగించిన ఘటనపై కేసు

ఘటనపై కేరళ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఐపీసీ లోని సెక్షన్‌లు 354 మరియు 509 కింద కేసు నమోదు చేయబడింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కొల్లం రూరల్ పోలీస్ జిల్లా పరిధిలోని చడయమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితురాలిగా ఎవరి పేరును పేర్కొనలేదని, పరీక్షా కేంద్రంలో విద్యార్థులను పరీక్షించిన ఏజెన్సీని తాము గుర్తించి, ఆపై వారిలో ఇన్నర్‌వేర్ తొలగించమని చెప్పిన మహిళను కనుగొంటామని ఒక పోలీసు అధికారి తెలిపారు.

నీట్ కు హాజరైన బాలిక ఇన్నర్ వేర్ తొలగింపుపై తండ్రి ఫిర్యాదు

నీట్ కు హాజరైన బాలిక ఇన్నర్ వేర్ తొలగింపుపై తండ్రి ఫిర్యాదు

ఆదివారం నీట్ పరీక్ష జరిగిన తర్వాత బాలిక తండ్రి కొల్లం రూరల్ ఎస్పీ కెబి రవికి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని కోరారు. కొల్లాంలోని ఆయుర్‌లోని మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో పరీక్షకు హాజరైన చాలా మంది విద్యార్థుల ఇన్నర్‌వేర్లను బలవంతంగా తొలగించారని, అదే క్రమంలో తమ కుమార్తె ఇన్నర్ వేర్ ను కూడా తొలగించినట్టు ఫిర్యాదులో తండ్రి ఆరోపించాడు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇన్నర్ వేర్లను తొలగించాల్సిన అవసరం లేదని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.

చాలా మంది బాలికల ఇన్నర్ వేర్ ల తొలగింపు.. విద్యార్థినులు ఏడ్చారని ఫిర్యాదు

చాలా మంది బాలికల ఇన్నర్ వేర్ ల తొలగింపు.. విద్యార్థినులు ఏడ్చారని ఫిర్యాదు

తన కూతురు ఇన్నర్‌వేర్‌ను తొలగించేందుకు నిరాకరించడంతో పరీక్షకు హాజరు కావద్దని చెప్పారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా చాలా మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని, చాలా మంది విద్యార్థినులు వద్దని ఏడ్చారు అని, తమ ఇన్నర్‌వేర్‌లను తీసివేయడానికి నిరాకరించినప్పుడు, మీకు భవిష్యత్తు ముఖ్యమా? ఇన్నర్‌వేర్ ముఖ్యమా అని అక్కడి సిబ్బంది అడిగినట్లుగా తమ కుమార్తె చెప్పిందని ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు.

 విద్యార్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారని ఆరోపణ

విద్యార్థులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యారని ఆరోపణ

పరీక్షా కేంద్రమైన మార్ థామస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ నిర్వాహకులు మాట్లాడుతూ, సంస్థ ప్రమేయం లేదని, విద్యార్థులను పరీక్షించే బాధ్యతను ఎన్‌టీఏ నియమించిన ఏజెన్సీ సిబ్బంది చూసుకున్నారని పేర్కొన్నారు. అయితే అటువంటి సంఘటనే జరగలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. విద్యార్థిని లోదుస్తులు అయిన బ్రా కు మెటల్ బటన్ ఉండడంతో తనిఖీ చేస్తున్న సమయంలో బీప్ శబ్దం వచ్చింది. దీంతో దానిని తొలగించి వెళ్లాలని అక్కడి సిబ్బంది సూచించారని తెలుస్తుంది. అయితే లోదుస్తుల తొలగింపు విద్యార్థులను మానసిక ఇబ్బందికి గురి చేసిందని, దాని ప్రభావం వారు రాసిన పరీక్షపై కూడా తప్పకుండా ఉంటుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ దృష్టికి తీసుకువెళ్తామన్న కేరళ విద్యా శాఖామంత్రి

కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ దృష్టికి తీసుకువెళ్తామన్న కేరళ విద్యా శాఖామంత్రి

ఈ సమస్యపై కేరళ ఉన్నత విద్యా మంత్రి డాక్టర్ ఆర్ బిందు విద్యార్థులను తనిఖీచేసిన ఏజెన్సీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను అత్యంత విచారకరమైన సంఘటనగా అభివర్ణించారు. బాలికల ప్రాథమిక మానవ హక్కులను ఏమాత్రం పట్టించుకోకుండా వారి పట్ల ఇలాంటి దృక్పథాన్ని అనుసరించడం చాలా శోచనీయం అని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ దృష్టికి తీసుకువెళుతుంది అని కేరళ ఉన్నత విద్య మంత్రి డాక్టర్ బిందు తెలిపారు.

English summary
The Kerala Police registered a case in connection with the alleged incident of a girl forced to remove her innerwear before sitting for the NEET exam in kerala's Kollam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X