Republic TV-Matrize exit poll 2023: మధ్యప్రదేశ్ లో బీజేపీదే విజయం-కాంగ్రెస్ కు రెండో స్దానమే..

జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ.. మ్యాట్రిజ్ తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో మధ్యప్రదేశ్ లో బీజేపీ మరోసారి విజయం సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడినా అంతిమంగా రెండో స్ధానంలో నిలుస్తుందని తేలిపోయింది. మధ్యప్రదేశ్ లో ఈ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు బీజేపీకి మరోసారి ఆధిక్యం కట్టబెట్టినట్లు రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

Recommended Video

    Exit Poll 2023: Madhya Pradesh లో BJP దే విజయం... Congress పరిస్థితి ..? | Telugu OneIndia

    రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ఇవాళ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల వివరాలు చూస్తే.. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి అత్యధికంగా 118-130 సీట్లు దక్కుతాయని తేలింది. ఆ తర్వాత స్ధానంలో కాంగ్రెస్ పార్టీకి 97-107 సీట్లు మాత్రమే దక్కుతున్నట్లు తేలింది. ఇతరులకు 1-2 సీట్లు దక్కుతాయని రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది. దీంతో మధ్యప్రదేశ్ పై బెంగపెట్టుకున్న బీజేపీకి ఇది శుభవార్త కానుంది.

    Republic TV-Matrize exit poll 2023 predicts bjp victory in Madhya pradesh, congress stands second

    మధ్యప్రదేశ్ లో దాదాపు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత బాగా ఉందని పలు ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. కానీ రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే అదేమీ లేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ గ్యారంటీలు ప్రకటించినా జనం మాత్రం ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనకే ఓటేసినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 3న ఇక్కడ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+