Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

National Film Awards: బెస్ట్ రిషబ్ శెట్టి - తెలుగులో కార్తికేయ 2..!!

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్ అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేట‌గిరిలో బలగంతో పాటు 'కార్తికేయ 2', 'మేజర్', 'సీతారామం' పోటీలో నిల‌వ‌గా.. కార్తికేయ 2 ఈ అవార్డును గెలుచుకుంది.

అవార్డుల ప్రకటన
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన సినిమాలకు కేంద్రం పురస్కారాలు ప్రకటించింది. 300కు పైగా సినిమాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2, ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్, ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 చిత్రాలు నిలిచాయి. కేజీఎఫ్ 2 కు పలు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ నటి అవార్డు నిత్యా మేనన్ (తిరుచిత్రమ్ బలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్)ఇద్దరికి వరించాయి. బెస్ట్ డైరెక్టర్ గా సూరజ్ 'ఉంచాయ్' మూవీకి దక్కింది.

Rishab Shetty wins Best Actor for Kantara Aatam as Best Feature Film

బలగం - కార్తికేయ 2
ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కేట‌గిరిలో కార్తికేయ 2 అవార్డును గెలుచుకుంది. క‌న్న‌డ విభాగంలో కేజీయఫ్ 2 చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ద‌క్కింది. మరాఠీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ది టెర్మైట్ అవార్డు ద‌క్కించుకోగా.. మ‌నోజ్ బాజ్‌పాయ్ గుల్‌మోహర్ చిత్రం హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ద‌క్కింది. త‌మిళంలో పొన్నియిన్‌ సెల్వన్‌ - 1, మలయాళంలో సౌది వెళ్లక్క సీసీ 225/2009 చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి.

దక్షిణాది చిత్రాల్లో
ఇక, కేటగిరీల వారీగా..ఉత్తమ తమిళ చిత్రం : పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 - ఉత్తమ మ్యూజికల్‌ డైరెక్టర్‌ రహమాన్‌ (పొన్నియన్‌ సెల్వన్‌-1) - ఉత్తమ సౌండ్‌ డిజైన్‌ - పొన్నియన్‌ సెల్వన్‌ - బెస్ట్‌ సినిమాటోగ్రఫీ- పొన్నియన్‌ సెల్వన్‌ - ఉత్తమ సహాయనటి నీనా గుప్తా - ఉత్తమ సహాయనటుడు పవన్‌ రాజ్‌ మల్హోత్రా - ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్-దీపక్‌ దువా (హిందీ) - ఉత్తమ తెలుగు చిత్రం కార్తికేయ-2 - ఉత్తమ తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1 - ఉత్తమ కన్నడ చిత్రం కేజీఎఫ్‌-2 - ఉత్తమ హిందీ చిత్రం గుల్‌మొహర్ - బెస్ట్ యాక్షన్‌ డైరెక్టర్‌గా అన్బరివ్ (కేజీఎఫ్‌-2)కు అవార్డులు దక్కాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+