భారత్ కు పెరుగుతున్న కరోనా పరేషాన్ : 44,643 కొత్త కేసులు, 4.14 లక్షల యాక్టివ్ కేసులు !!

భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ పెరిగిన కేసులతో భారతదేశంలో ఆందోళన వ్యక్తమౌతుంది. ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేసుల పెరుగుదల టెన్షన్ పుట్టిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 44,643 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే దాదాపు 4 శాతం ఎక్కువ. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల మొత్తం సంఖ్య 3,18,56,757 కు చేరుకుంది.

 భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు, క్రియాశీల కేసులు

భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త కేసులు, క్రియాశీల కేసులు

దేశంలో 40,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవడం ఇది వరుసగా మూడో రోజు కాగా, గురువారం నాటి లెక్కల నుండి 42,982 నమోదైనప్పుడు తాజాగా గత 24 గంటల్లో 2,000 కి పైగా కేసులు పెరిగాయి.దేశం గత 24 గంటల్లో 464 మరణాలను నివేదించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 4,26,754 కు చేరుకుంది. భారతదేశం యొక్క క్రియాశీల కోవిడ్ -19 గణాంకాలు ఇప్పుడు 4,14,159 వద్ద ఉన్నాయి. మొత్తం కరోనా కేసులలో క్రియాశీల కేసులు 1.29 శాతం.

దేశంలో రికవరీ రేటు 97.36 శాతం

దేశంలో రికవరీ రేటు 97.36 శాతం

ఇక దేశంలో రోజువారీ పరీక్ష పాజిటివిటీ రేటు 100 కి గుర్తించబడిన పాజిటివ్ కేసుల సంఖ్య 2.72 శాతంగా ఉంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 41 వేల మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. రికవరీ రేటు 97.36 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే 20 వేలకు పైగా కేసులను స్థిరంగా నమోదు చేసే ప్రధాన కోవిడ్ హాట్‌స్పాట్‌గా కేరళ నిలిచింది. కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది.

కేరళ, మహారాష్ట్రలలో భారీగా కరోనా కేసులు

కేరళ, మహారాష్ట్రలలో భారీగా కరోనా కేసులు


తాజాగా రోజువారీ అత్యధిక సంఖ్యలో కోవిడ్ కేసులతో ఆందోళన చెందుతున్న కేరళలో 22,040 కేసులు నమోదయ్యాయి. ఇది 117 మరణాలను కూడా నివేదించింది. మహారాష్ట్రలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తుంది.దేశంలో మొత్తం కేసుల్లో ముందున్న మహారాష్ట్రలో 24 గంటల వ్యవధిలో 9,026 కేసులు మరియు 120 మరణాలు నమోదయ్యాయి. 2,145 కోవిడ్ కేసులతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 1,997, కర్ణాటక 1,785 తో రోజూ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న ఇతర దక్షిణాది రాష్ట్రాలు గా నిలిచాయి. తెలంగాణలో ఒక రోజులో 582 కేసులు నమోదయ్యాయి.

వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇదే

వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇదే

దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 26 తాజా కోవిడ్ కేసులు మరియు మూడు మరణాలు నమోదయ్యాయి. రాజస్థాన్, గుజరాత్, బీహార్ మూడు పెద్ద రాష్ట్రాలలోనూ 24 గంటల వ్యవధిలో కోవిడ్ మరణాలు నమోదుకాలేదు. ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ వంటి పలు ఇతర రాష్ట్రాలలో కూడా కరోనా మరణాలు నివేదించబడలేదు. 1,067 కోవిడ్ కేసులతో, అస్సాం ఈశాన్య రాష్ట్రాలలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కేసులతో ముందంజలో ఉంది. దాని తర్వాత మిజోరం లో 725 కేసులు, మేఘాలయలో 576 కేసులు ఉన్నాయి . పర్యాటకుల హాట్ ఫేవరెట్ గోవాలో ఒకే రోజు 102 కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి.

 గత 24 గంటల్లో కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు ఇలా

గత 24 గంటల్లో కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు ఇలా

కరోనా మహమ్మారి కారణంగా నిర్వహిస్తున్న పరీక్షలలో 47,65,33,650 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. వీటిలో 16,40,287 పరీక్షలు గంటల్లో నిర్వహించినట్లు వెల్లడించింది. గత 24 గంటల్లో 57,97,808 వ్యాక్సిన్ డోస్‌లు కరోనా మహమ్మారి కి వ్యతిరేకంగా నిర్వహించబడ్డాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలైన దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య 49,53,27,595 కి చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+