శ్రీనగర్‌లో రైజింగ్ కాశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీ దారుణ హత్య
శ్రీనగర్: రైజింగ్ కాశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీని తీవ్రవాదులు కాల్చి చంపారు. గురువారం సాయంత్రం ఈ సంఘటన జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. తొలుత టెర్రరిస్టుల దాడిలో షుజాత్ బుఖారీ, అతని సెక్యూరిటీ గాయపడ్డారు. కానీ ఆ తర్వాత షుజాత్ కన్నుమూశాడు.
రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ పార్టీకి వెళ్తుండగా ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అతనిని కార్యాలయం ఎదుటే కాల్చి చంపారు. షుజాత్ బుఖారీ వయస్సు 50. అతను తన కార్యాలయం నుంచి ఇఫ్తార్ పార్టీకి బయలుదేరాడు. అప్పుడు కాల్పులు చోటు చేసుకున్నాయి.

ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. బుఖారీ పైన ఎంతమంది దాడికి పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. బుఖారీ మృతిపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాపం తెలిపారు. బుఖారీ మృతి తనను షాక్‌కు గురి చేసిందన్నారు. ఇలాంటి దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనను ఖండించారు.












Click it and Unblock the Notifications