సిగ్గుచేటు: కావేరీ జలాల ఘర్షణపై కమల్ హాసన్ ఘాటు వ్యాఖ్యలు
చెన్నై: కావేరీ జలాల పంపిణీ విషయంలో తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య రేగిన ఘర్షణపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. నదీ జలాల కోసం ఘర్షణ పడడం సిగ్గుచేటైన విషయంగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

'మనం భాష తెలియని వానరాలుగా ఉన్నప్పుడూ కావేరీ ప్రవహించింది. మానవుడిగా మారి నాగరికత నేర్చుకున్న తర్వాత కూడా ప్రవహిస్తూనే ఉంది. మనతరం ముగిసిన తర్వాత కూడా అది అలానే ప్రవహిస్తుంది. జరిగిన చరిత్రను ఆ నది చెబుతుంటే మనం మాత్రం ఘర్షణలకు పాల్పడడం సిగ్గుచేటు' అని ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే కావేరీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక-తమిళనాడుల మధ్య మంగళవారం పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కన్నడిగులు తమిళనాడుకు చెందిన 40 బస్సులకు నిప్పించారు. మొత్తంగా ఈ ఘర్షణల వల్ల కర్ణాటకలో సుమారు రూ. 25వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
பிழைக்கு மன்னிக்க. கண்ணாடியில் என்றிருத்தல் வேண்டும்.
— Kamal Haasan (@ikamalhaasan) September 14, 2016
நாம் மொழியற்ற குரங்குகளாயிருந்த போதும் காவிரி ஓடியது.நமக்குப் பின்னும் அது ஓடும். சரித்திரக்கமண்ணாடியில் முகம் பாரத்து வெட்க வேண்டி வரும்
— Kamal Haasan (@ikamalhaasan) September 14, 2016












Click it and Unblock the Notifications