ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి

నగౌర్ నగరానికి వెళ్లి తిరిగి తమ నివాసానికి చేరుకుంటున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు వీరందరూ వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద స్థలంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగితా ఎనిమిది మంది ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలారు. మెరుగైన చికిత్స కోసం గాయాలపాలైన మరో ఇద్దర్ని జోధ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని అడిషనల్ ఎస్పీ ప్యారేలాల్ తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిలో ఎనిమిది మందిన అన్వర్, సకీర్, ఉమర్, అసిఫ్, ఫర్జాన్, నదియా, అలిషా, ఉమేదాలుగా గుర్తించారు.
బాంబు పేలి బాలుడు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని రూర్మీలో శనివారం బాంబు పేలింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications