వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డుప్రమాదం: లోయలో పడిన బస్సు; ఐదుగురు మృతి, 47మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్-ఖాండ్వా రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు. మరో 47 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లుగా గుర్తించారు.

మధ్యప్రదేశ్ లో లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి, 47 మందికి గాయాలు

మధ్యప్రదేశ్ లో లోయలో పడిన బస్సు.. ఐదుగురు మృతి, 47 మందికి గాయాలు


ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురిలో ముగ్గురు మహిళలు కాగా,మిగతావారు పురుషులు. ఈ ఘటనలో 47 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో, క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం మార్మ్రోగింది. ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షించిన ఇండోర్‌ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. డ్రైవర్‌ బస్సు అదుపు తప్పి లోయలో పడడంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. బస్సు వేగంగా వచ్చిందని, ఓవర్‌టేక్ చేస్తుండగా, బస్సు బ్యాలెన్స్ తప్పి లోయలో పడిందని స్థానికులు చెబుతున్నట్లుగా పేర్కొన్నారు.

వేగంగా బస్సు ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం..డ్రైవర్ పరిస్థితి విషమం

వేగంగా బస్సు ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం..డ్రైవర్ పరిస్థితి విషమం

ఇప్పటి వరకు, ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. మితిమీరిన వేగం కూడా బస్సు అదుపు తప్పటానికి కారణమని పేర్కొన్నారు. బస్సు యజమానిని గులాబ్ సోంకర్‌గా గుర్తించామని, బస్సు యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సిమ్రోల్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు నడుపుతున్న బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని, అతను మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆయన తెలిపారు.

 ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 4లక్షలు, గాయపడిన వారికి 50వేలు పరిహారం

ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 4లక్షలు, గాయపడిన వారికి 50వేలు పరిహారం

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన పరిస్థితిని పరిశీలించి, మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు పరిహారాన్ని అందించనున్నట్టు ప్రకటించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ప్రకటించారు. మధ్యప్రదేశ్ టూరిజం మంత్రి ఉషా ఠాకూర్, జలవనరుల శాఖ మంత్రి తులసీ సిలావత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.

English summary
A serious road accident has taken place on the Indore-Khandwa road in the state of Madhya Pradesh. Five people were killed when a bus plunged into a valley after overtaking another vehicle. 47 people were injured in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X