Rolls Royce Ghost Series II:సరికొత్త ఫీచర్లతో.. భారత్ లోకి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2
Rolls Royce Ghost Series II: లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ భారత మార్కెట్లోకి తమ సరికొత్త ఘోస్ట్ సిరీస్ 2 మోడల్ ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త ఇంటీరియర్ ఫీచర్లను, ఎక్స్ టీరియర్ ఫీచర్లను ఈ సిరీస్ తో పరిచయం చేస్తున్నట్లు రోల్స్ రాయిస్ సంస్థ పేర్కొంది. అధునాతన సాఫ్ట్ వేర్ సాంకేతికత సహాయంతో రూపొందించబడిన ఈ లగ్జరీ కారుతో వినియోగదారులు డిజిటల్ ప్రపంచానికి మరింత చేరువయ్యేలా ఈ కారును రూపొందించడం విశేషం. సరికొత్త స్టైలింగ్ తో ఘోస్ట్ సిరీస్ ఎక్స్ టీరియర్ డిజైన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ట్విన్ టర్బో ఛార్జింగ్ సామర్థ్యం గల ఇంజిన్, ప్లానర్ సస్పెన్షన్ సిస్టమ్, ఫ్లాగ్ బేరర్, డ్రైవర్ ఆధారిత ఛాసిస్ కు తోడ్పడే శాటిలైట్ ఆధారిత ట్రాన్స్ మిషన్ సిస్టమ్ వంటి టెక్నాలజీలు ఆకట్టుకుంటున్నాయి. ఘోస్ట్ సిరీస్ 2 లో మెరుగైన ఆడియో సిస్టమ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో స్ట్రీమింగ్ ఫీచర్లు ఉన్నాయి. చెన్నై, న్యూఢిల్లీ షోరూంలలో ఈ కార్లను ఆర్డరు చేసుకునే సౌకర్యం కలదు.
ఘోస్ట్ సిరీస్ సామర్థ్యాలను మా వినియోగదారులు తప్పకుండా ప్రశంసిస్తారని ఆశిస్తున్నామని రోల్స్ రాయిస్ మోటార్స్ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ ఐరీన్ నిక్కైన్ పేర్కొన్నారు. ఘోస్ట్ సిరీస్ 2 దాని సూత్రాలకు కట్టుబడి ఉండటంతో పాటు ప్రత్యేక ఉనికిని చాటుతుందన్నారు. అధునాతన సాంకేతికతతో పాటు డ్రైవర్ ఫోకస్డ్ వీ 12 రోల్స్ రాయిస్ లగ్జరీ కారు ప్రత్యేకంగా నిలవనుందన్నారు.2024 నాటికి మూడింట ఒక వంతు మార్కెట్ విస్తరణతో భారత్ లో అత్యంత వాంఛనీయ లగ్జరీ బ్రాండ్ గా రోల్స్ రాయిస్ తమ స్థానాన్ని పదిలం చేసుకుందన్నారు.ఘోస్ట్ సిరీస్ 2 ప్రస్తుతం భారతదేశంలో లభ్యం అవుతుండటంతో, క్లయింట్లు మరింత విలువైన మోటారు కార్లను తయారు చేయడానికి ఉత్సాహం చూపుతారని ఆశిస్తున్నానని ఐరీన్ నిక్కైన్ పేర్కొన్నారు.

*భారత్ లో లభించే మూడు ఘోస్ట్ సిరీస్ 2 వేరియంట్లు ఇవే..
ఘోస్ట్ సిరీస్ 2
బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2
ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2
*వినియోగదారులకు కావల్సిన ఫీచర్లను బట్టి రోల్స్ రాయిస్ ధర ఉంటుంది.
ఘోస్ట్ సిరీస్ 2 ధర - రూ. 8,95,00,000
ఘోస్ట్ ఎక్స్ టెండెడ్ సిరీస్ 2 ధర - రూ. 10,19,00,000
బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ సిరీస్ 2 ధర - రూ. 10,52,00,000












Click it and Unblock the Notifications