వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతి మేడం ఇదేం పని?: గుర్రుగా యోగి ఆదిత్యనాథ్

ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా మంత్రి బీర్ షాప్‌ను తెరవడం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చిక్కులు తెచ్చేలా ఉంది. విషయం తెలియగానే ఆయన పూర్తి సమాచారం కావాలని అధికారులను ఆదేశించారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఓ మహిళా మంత్రి బీర్ షాప్‌ను తెరవడం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చిక్కులు తెచ్చేలా ఉంది. విషయం తెలియగానే ఆయన పూర్తి సమాచారం కావాలని అధికారులను ఆదేశించారు.

ఒక్క పనితో యూపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యారు.

లగ్జరీ బార్ ప్రారంభించిన స్వాతి

లగ్జరీ బార్ ప్రారంభించిన స్వాతి

బీ ద బీర్‌ అనే పేరుగల లగ్జరీ బార్‌ను ఆమె ప్రారంభించారు. ఈ మేరకు ఫోటోలు నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. బీఫ్‌ను బ్యాన్ చేసిన బీజేపీ ప్రభుత్వంలో ఓ మహిళా మంత్రి ఓ బీర్ దుకాణాన్ని ఓపెన్ చేయడం ఆ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతోంది.

స్వాతి మేడమ్ ఇదేం పని

స్వాతి మేడమ్ ఇదేం పని

బీఫ్‌ను బ్యాన్‌ చేసి.. బీర్‌ను పొంగిస్తున్నారు.., ముఖ్యమంత్రేమో మద్యం నిషేధిస్తానంటాడు.. మంత్రులేమో మద్యం దుకాణాలకు క్యూకడుతున్నారు.., ముసుగు తొలిగిస్తే కనబడే బిజెపి అసలు ముఖం ఇదే.., స్వాతి మేడమ్‌ ఏమిటీ పని.. అంటూ మంత్రి భుజం మీదుగా బిజెపి, యోగిలపై నెటిజన్లు విమర్శలు సంధింస్తున్నారు.

స్వాతి వివాదం

స్వాతి వివాదం

అంతా సాఫీగా జరుగిపోతున్నవేళ స్వాతి చర్యతో మొదలైన వివాదంపై సీఎం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. అసలా కార్యక్రమానికి ఎందుకు వెళ్లాల్సివచ్చిందో స్వాతిని వివరణ కోరారని తెలుస్తోంది.

స్వాతి ఎవరంటే..

స్వాతి ఎవరంటే..

బిఎస్పీ అధినేత్రి మాయావతిని అభ్యంతరకంగా దూషించి, బిజెపి నుంచి ఆరేళ్లపాటు సస్సెండ్‌ అయిన దయాశంకర్‌ సింగ్‌ సతీమణే స్వాతి సింగ్. యోగి కేబినెట్లోని మహిళా మంత్రుల్లో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

English summary
Photographs of Uttar Pradesh minister Swati Singh purportedly inaugurating a beer bar have gone viral on social media stirring a controversy with the opposition parties on Tuesday questioning if this is the true face of the BJP government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X