కూరగాయల మార్కెట్ లో రాజవంశస్తులు, చరిత్రలో మొదటి సారి, వెనకడుగు వేసిన వ్యాపారులు !

మైసూరు: మైసూరు రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారితో కలిసి మైసూరు నగరంలోని దేవరాజ్ మార్క్ ట్ లో ఆకస్మికంగా ప్రత్యక్షం అయ్యారు మార్కెట్ లోని వ్యాపారులను కలిసిన కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారి వారిని ఆప్యాయంగా పలకరించారు.

మార్కెట్ చేరుకున్న కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారి అక్కడ ఆకు కూరలు, కూరగాయలు ఖరీదు చేసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. రాజకుమారి త్రిషికా కుమారి అక్కడి మార్కెట్ లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నంజగూడు మామిడి పండ్లు కొనుగోలు చేశారు.

Royal couple visits Mysuru devaraja market and shopped vegetables.

ఆకు కూరలు, పండ్లు కూరగాయలు కొనుగోలు చేసిన రాజదంతుల దగ్గర నగదు తీసుకోవడానికి వ్యాపారులు వెనకడుగు వేశారు. అయితే రాజ దంపతులు వ్యాపారులకు నమస్కరించి నచ్చచెప్పి వారికి బలవంతంగా నగదు ఇచ్చి అక్కడి నుంచి వెనుతిరిగారు. అంతకు ముందు రాజ దంపతులు వ్యాపారులతో చర్చించి అక్కడ వారి సమస్యలు తెలుసుని వెంటనే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

కూరగాయల మార్కెట్ నుంచి గురు స్వీట్స్ మార్కెట్ చేరకున్న రాజ దంపతులు అక్కడ మైసూరు పాక్ కొనుగోలు చేశారు. మైసూరు మహారాజులు నేరుగా మర్కెట్ చేరుకుని కూరగాయలు, పండ్లు కొనుగోలు చెయ్యడం చరిత్రలో ఇది మొదటి సారి. రాజ దంపతులు మార్కెట్ చేరుకున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.

మైసూరు రాజవంశస్తుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ రాజకీయాల్లోకి వస్తారని గతంలో ప్రచారం జరిగింది. గత శాసన సభల ఎన్నికల సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా నేరుగా రాజమాతను కలిశారు. ఆసమయంలో అమిత్ షా రాజ వంశస్తులను రాజకీయాల్లోకి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే మైసూరు రాజవంశస్తులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+