భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీర్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14033 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: భారతీయ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 14033
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 31 జనవరి 2019

విద్యార్హతలు
-> జూనియర్ ఇంజనీర్: డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ
కెమికల్ &మెటలర్జికల్ అసిస్టెంట్: ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా డిగ్రీ
డిపో మెటీరియల్ సూపర్ఇంటెండెంట్: డిప్లొమా/ ఇంజనీరింగ్ డిగ్రీ
జూనియర్ ఇంజనీర్(ఐటీ): బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీటెక్ (ఐటీ/ కంప్యూటర్ సైన్స్)
వయస్సు: జనవరి 1, 2019 నాటికి 18 నుంచి 33 ఏళ్లు
వేతనం : నెలకు రూ. 35400/-
అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు: రూ.250/-
ఇతరులు: రూ. 500/-
ఎంపిక విధానం : ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 2 జనవరి 2019
దరఖాస్తులకు చివరి తేదీ : 31 జనవరి 2019
మరిన్ని వివరాలకు link: https://goo.gl/T75Bmr












Click it and Unblock the Notifications