వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌ పార్టీలో తాజా సంక్షోభం వెనుక కారణమిదేనా ? రాజ్యసభ పదవులే చిచ్చు రేపాయా ?

|
Google Oneindia TeluguNews

శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ తన వందేళ్లకు పైబడిన ప్రస్ధానంలో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ తాజాగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభంలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు విభ్రమ కలిగించేలా ఉంది. ముఖ్యంగా పార్టీ పదవుల్లో ఏర్పడిన భేదాభిప్రాయాలతో ఏకంగా నాయకత్వాన్నే ఆత్మరక్షణలో నెట్టేలా ఉన్న ఈ నేతల తీరు జనం విస్తుపోయేలా చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ పగ్గాల కోసం జరుగుతున్న పోరాటంగా పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా తమ పంతాలు నెరవెర్చేకునేందుకు అసంతృప్త నేతలు రేపిన ఈ కల్లోలం ప్రస్తుతానికి టీ కప్పులో తుఫానులా సమసిపోయినా మళ్లీ ఏదో ఒక రోజు తిరగబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తాజా సంక్షోభానికి కారణమైన అసలు వాస్తవాలపై ఓ విశ్లేషణ..

 కాంగ్రెస్‌ తాజా సంక్షోభం..

కాంగ్రెస్‌ తాజా సంక్షోభం..

కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఓ దశా దిశా లేకుండా ఉందంటూ పార్టీలో సీనియర్లుగా ఉన్న 23 మంది నేతలు అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాయడం ద్వారా ఓ కొత్త సంక్షోభానికి తెరదీశారు. పైకి మాత్రం పార్టీని రక్షించుకునే ప్రయత్నంగా కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తమ పంతాలు నెగ్గించుకోవడానికి అధిష్టానాన్నే ధిక్కరించే యత్నం జరిగినట్లు అర్ధమవుతూనే ఉంది. పార్టీ నేతల లేఖపై యువనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారని సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుండగానే లీకులు రావడాన్ని బట్టి చూస్తే ఆ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అభద్రతాభావం, క్రమశిక్షణారాహిత్యం ఇట్టే తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ సంక్షోభానికి తాత్కాలికంగా ముగింపు పలికినా భవిష్యత్తులో ఇది రిపీట్‌ కాదన్న గ్యారంటీ ఎవరూ ఇవ్వలేని పరిస్ధితి.

పార్లమెంటు పదవుల చిచ్చు...

పార్లమెంటు పదవుల చిచ్చు...

వరుసగా రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయాల తర్వాత లోక్‌సభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం నామమాత్రంగా మారిపోయింది. 2014లో కర్నాటకలోని గుల్బర్గా నుంచి గెలిచిన సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే దిగువసభలో విపక్ష నేతగా వ్యవహరించారు. కానీ 2019లో ఆయన ఓటమిపాలవ్వడంతో ఆయన స్ధానంలో విపక్ష నేత స్ధానాన్ని ఆశించి ఇద్దరు నేతలు భంగపడ్డారు. వీరే శశిధరూర్‌, మనీష్‌ తివారీ. వీరిద్దరిని కాదని అధిష్టానం అధిర్‌ రంజన్‌ చౌదరి వైపు మొగ్గు చూపడంతో అసంతప్తిగా ఉన్న వీరిద్దరూ తాజాగా సోనియాకు లేఖ రాసిన 23 మందిలో చేరిపోయారు. అదే సమయంలో లోక్‌సభకు 9 సార్లు ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబ విధేయుడు మల్లిఖార్జున ఖర్గేను తాజా ఓటమి తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయాలన్న నిర్ణయం నేతల్లో అసంతృప్తి నింపింది. అంతే కాదు ప్రస్తుతం రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ వచ్చే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేస్తారు. ఆయన స్ధానంలో ఖర్గేకు అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ రాజ్యసభలో ఐదేళ్లుగా ఆజాద్ కు డిప్యూటీగా ఉన్న ఆనంద్‌ శర్మతో పాటు మిగతా వారు కూడా ఈ స్ధానం ఆశించారు. తొలిసారి రాజ్యసభకు ఎంపికైన ఖర్గే విపక్ష నేత కావడం ఇష్టం లేని అక్కడి సీనియర్లు తమ అసంతృప్తిని ఎలా వెళ్లగక్కాలో తెలియక సోనియాకు లేఖ రూపంలో వేరే విషయాలు ప్రస్తావించారు.

ఆరునెలల క్రితమే మొదలైంది...

ఆరునెలల క్రితమే మొదలైంది...


ఆరు నెలల క్రితం కర్నాటకలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాగా... అందులో ఒకటి మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి దక్కింది. ఈ ఒక్క స్ధానానికి రాహుల్ విధేయుడు రాజీవ్‌ గౌడకు మరోసారి అవకాశం దక్కుతుందని భావించినా అనూహ్యంగా పార్టీ మాత్రం ఖర్గే వైపే మొగ్గుచూపింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఖర్గేకు తొలిసారి రాజ్యసభ అవకాశం దక్కింది. ఇదే కోవలో మహారాష్ట్ర నుంచి కూడా పార్టీ సీనియర్‌ ముకుల్‌ వాస్నిక్‌కు కాదని రాహుల్‌ సన్నిహితుడు రాజీవ్‌ సతవ్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో వాస్నిక్‌ లోనూ అసంతృప్తి నెలకొంది. అటు కర్నాటకలో ఖర్గేను రాజ్యసభకు పంపడం ఇష్టంలేని వర్గం, ఇటు మహారాష్ట్రలో ముకుల్‌ వాస్నిక్‌ వర్గం అంతా కలిసి సోనియాకు లేఖ సంధించారు.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి
 సామాజిక సమీకరణాలు...

సామాజిక సమీకరణాలు...

పార్టీలో సీనియర్లు ఏమనుకున్నా సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ మాత్రం సామాజిక సమీకరణాలపైనే ఆధారపడింది. 2014లో పార్లమెంటులోని ఉభయసభల్లో ఖర్గే-ఆజాద్ రూపంలో దళిత-ముస్లిం ఫార్ములా పాటించిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి లోక్‌సభకు విపక్ష నేతగా అధిర్‌ రంజన్ చౌదరిని ఎంపిక చేయాల్సి రావడంతో కనీసం రాజ్యసభలో ఆజాద్‌ ఖాళీ చేస్తున్న స్ధానాన్ని తిరిగి బలహీనవర్గానికి చెందిన ఖర్గేకు ఇస్తే బావుంటుందని భావిస్తోంది. అదే ఇప్పుడు పార్టీలో అగ్రవర్ణాలకు నచ్చడం లేదు. అయితే ఖర్గేను రాజ్యసభ విపక్ష నేతగా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఆయన సామాజిక నేపథ్యం కంటే గాంధీ కుటుంబ విధేయత, కేంద్రమంత్రి, విపక్ష నేతగా సమర్ధత ఉన్నాయనేది పార్టీలో అత్యధికుల అభిప్రాయం. దీన్ని అంగీకరించడం ఇష్టం లేని కొందరు సీనియర్లు సోనియాను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారనేది తాజాగా సుస్పష్టమైన వాస్తవం.

English summary
recent rajya sabha appointents were seems to be the reason behind latest leadership crisis in century old congress party. especially mallikharjuna kharge's entry into rajya sabha is crucial behind this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X