వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా: పుతిన్ వెనుక పదే పదే కనిపిస్తున్న ఈ మహిళ ఎవరు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్లాదిమిర్ పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తన ప్రసంగ సమయంలో, అంతకుముందు కొన్ని ఈవెంట్లలో చుట్టూ నటులను పెట్టుకున్నారని సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్ వెబ్‌సైట్లలో వచ్చింది.

ఈ క్లెయిమ్‌లలో నిజానిజాలు తేల్చడానికి మేం ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాం.

కొన్ని ఈవెంట్లలో తన చుట్టూ నకిలీలను ఉంచిన ట్రాక్ రికార్డు పుతిన్‌కు ఉంది. అంటే... వారు ఎవరనేది బయటకు ఒకలా చెప్పినప్పటికీ అక్కడుండే వాస్తవ మనుషులు మాత్రం వేరే ఉంటారనేది ఆరోపణ.

సాధారణ ప్రజలతో పుతిన్ సమావేశమైనట్లుగా, మాట్లాడుతున్నట్లుగా చెప్తూ విడుదల చేసే వీడియోల్లో ఉన్నవారు సాధారణ ప్రజలు కాదని.. వారంతా పుతిన్ అనుకూలురైన అధికారులని 2020లో రష్యాలో జరిపిన ఇన్వెస్టిగేషన్లలో తేలింది.

పుతిన్ వెనుక మహిళ

అన్ని ఫొటోలలో అదే మహిళ.. ఇంతకీ ఎవరామె?

పుతిన్ పాల్గొన్న అనేక ఈవెంట్లలో ఓ మహిళ ఆయన వెనుక కనిపిస్తుంటారని.. వేర్వేరు సందర్భాలలో వేర్వేరు పాత్రల్లో ఆమె కనిపిస్తుంటారని 'ది సన్’, 'డైలీ మెయిల్’ సహా అనేక వెబ్‌సైట్లు రాశాయి. సోషల్ మీడియా పోస్టులలోనూ ఈమె ప్రస్తావన కనిపిస్తుంటుంది.

2016లో పుతిన్ ఫిషింగ్ ట్రిప్, 2017లో చర్చ్ సర్వీస్‌లో పుతిన్ పాల్గొన్నప్పటి చిత్రాలలో ఈమె కనిపిస్తారు.

ఆమె రష్యా ఫెడరల్ గార్డ్ సర్వీస్ (ఎఫ్ఎస్ఓ)కు చెందిన అధికారిణిగా కొన్ని వార్తాసంస్థలు, ఓ యుక్రెయిన్ న్యూస్‌రిపోర్ట్ పేర్కొన్నాయి. అగ్రశ్రేణి నేతల రక్షణ బాధ్యతను ఎఫ్ఎస్ఓ చూస్తుంది.

పుతిన్ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంలోని చిత్రాలలో కనిపిస్తున్న మహిళ ముఖాన్ని 2016, 2017 నాటి ఈవెంట్లలో కనిపిస్తున్న మహిళ చిత్రంతో పోల్చి చూడడానికి ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాం.

పుతిన్ వెనుక మహిళ

అయితే.. 2016 నాటి చిత్రంతో పోల్చినప్పుడు 29 శాతం.. 2017 నాటి చిత్రంతో పోల్చినప్పుడు 28 శాతం సారూప్యత కనిపించింది.

'సాధారణంగా సారూప్యత శాతం 75 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఐడెంటిటీ మ్యాచ్ అయినట్లు చెప్పొచ్చు’ అని బ్రాడ్‌ఫర్డ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ విజువల్ కంప్యూటింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ హసన్ ఉగాలీ చెప్పారు.

అయితే.. 2016, 2017 నాటి చిత్రాలలో ఆ మహిళను పోల్చినప్పుడు 99.1 శాతం సారూప్యత కనిపించింది.

రష్యా మీడియా ఈ మహిళను లారిసా సెర్గూఖినాగా గుర్తించింది. ఫొటోలలో ఈమె కనిపించిన 2016, 2017 నాటి ఈవెంట్లు రెండూ నోవ్గోరోడ్ ప్రాంతంలో జరిగినవే. ఆమె అక్కడ రీజనల్ పార్లమెంట్‌లో సభ్యురాలు. యునైటెడ్ రష్యా పార్టీ నుంచి రీజనల్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ పార్టీ పుతిన్‌కు మద్దతిస్తుంది.

2016 నాటి చిత్రంలో కనిపిస్తున్న ఆమెను.. యునైటెడ్ రష్యా పార్టీ వెబ్‌సైట్లో ఉన్న ఆమె చిత్రంతో పోల్చినప్పుడు 99.8 శాతం మ్యాచ్ అయింది.

నోవ్గోరోడ్‌లో చేపల వ్యాపారం చేసే సంస్థ వ్యవప్థాపకురాలిగా కూడా సెర్గూఖినా పేరు రికార్డులలో ఉంది.

అయితే.. ఈ ఏడాది నూతన సంవత్సరం తొలిరోజున పుతిన్ ప్రసంగం నాటి చిత్రాలలో కనిపిస్తున్న మహిళ పేరు అన్నా సెర్గీవ్నా సిడోరెంకో అని రష్యా మీడియా చెప్తోంది. రష్యాకు చెందిన ఓ న్యూస్‌పేపర్ ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసిన వీడియో ఇంటర్వ్యూలో ఉన్న సిడోరెంకో చిత్రంతో ఈ చిత్రాన్ని పోల్చినప్పుడు 99.5 శాతం మ్యాచ్ అయింది.

మరోవైపు యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పబ్లిష్ చేసిన రష్యా మిలటరీ రెజిమెంట్‌‌కు చెందినవారి జాబితాలోనూ ఈమె పేరు ఉంది.

2016, 2017 నాటి చిత్రాలు

చేపలవేట చేసేవారిలా ఉన్న కొందరు 2016లో పుతిన్‌తో ఫొటో దిగిన ఫొటోనూ మేం పరిశీలించాం.

2017లో పుతిన్ చర్చ్ సర్వీస్‌లో దిగిన ఫొటోలలోనూ వీరిలో చాలామంది కనిపించారు.

ఈ రెండు చిత్రాలలోనూ కామన్‌గా కనిపించిన నలుగురిని ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో పరిశీలించగా 99 శాతం సరిపోలాయి. దీంతో వారు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేశాం.

ఇందులో కనిపించినవారిలో ఫిషింగ్ క్రూ లీడర్ అలెక్సీ ల్యాషెంకో(1) ఉన్నారు. ఆ ఫిషింగ్ క్రూ సోషల్ ప్రొఫైల్‌లో వీరి వివరాలున్నాయి. ఆయన కుమారుడు యెవ్నీ ల్యాషెంకో(5) కూడా ఈ చిత్రాలలో ఉన్నారు. ఆయన కూడా ఫిషింగ్ క్రూ సభ్యుడే. వారిద్దరి వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించినప్పుడు వారిద్దరూ తండ్రీకొడుకులని అర్థమైంది.

ఈ క్రూ స్థానికంగా ఉన్న 'ఎవ్రోకిమ్‌సర్వీస్’ అనే ఒక వ్యవసాయ సమ్మేళనంలో భాగం. దీని జనరల్ డైరెక్టర్ లారిసా సెర్గూఖినా(3).

కాగా ఈ చిత్రంలోని మరో వ్యక్తి సెర్గీ అలెగ్జాండ్రోవ్(2) నిజంగానే మత్స్యకారుడని రష్యా మీడియా రాసింది. ఆయన సోషల్ మీడియా ప్రొఫైల్‌లోనూ ఆయన ఫిషింగ్ బోటుపై ఉన్న చిత్రాలున్నాయి.

మరో వ్యక్తి(4)కి సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్ మాకు దొరకలేదు.

అయితే, ఆన్‌లైన్‌లో ఆయన్ను పోలిన చిత్రం ఒకటి దొరికింది.

దానిపై ఎవరో 'పుతిన్‌తో ఫొటో ఎలా సాధ్యమైంది’ అనే కామెంట్ చేశారు.

ఆ కామెంట్‌కు ఇంకొకరు.. 'నొవ్గోరోడ్‌లో ఆయన చాలాసార్లు పుతిన్‌ను కలిశారు’ అని ఉంది.

రైతుల్లా కనిపిస్తున్నవారు

ఆన్‌లైన్లో ఉన్న మరో చిత్రంలోనూ ఈ ఇద్దరూ పుతిన్‌ను కలిసినట్లు ఉంది. అందులో స్టావ్రోపోల్ ప్రాంతంలో రైతుల్లా అందులో కనిపిస్తున్నారు.

అయితే.. మత్స్యకారుల్లా కనిపిస్తున్న చిత్రాలలో వీరి ముఖాలను ... రైతులలా కనిపిస్తున్న చిత్రంలోని ముఖాలతో పోల్చినప్పుడు 8 శాతం మాత్రమే సారూప్యత కనిపించింది.

ఐస్ క్రీం అమ్మాయి

ఐస్‌క్రీం అందించే అమ్మాయి..

పుతిన్ వెనుక బంగారు రంగు జుత్తులో కనిపించే మహిళ మరికొన్ని ఈవెంట్లలోనూ పుతిన్ దగ్గర కనిపించినట్లు ఫొటోలున్నాయి.

2017, 2019లలో ఎయిర్ షో సందర్భంగా తీసిన వేర్వేరు చిత్రాలలో ఆమె పుతిన్ పాల్గొన్న ఈవెంట్‌లో ఐస్‌క్రీమ్ సర్వ్ చేస్తూ కనిపించారు.

అయితే.. తక్కువ రిజల్యూషన్ ఉండడంతో ఈ రెండు చిత్రాలు కూడా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో సరిపోలలేదు.

అయితే, 2019 నాటి ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ఓ అమ్మాయి పైరెండు సందర్భాలలోనూ పుతిన్‌కు తానే ఐస్‌క్రీం అందించినట్లుగా చెప్పడం కనిపించింది.

అయితే... పుతిన్‌కు ఐస్‌క్రీం అందించినట్లుగా చెప్తున్న అమ్మాయే ఎయిర్ షో సమయంలో పుతిన్‌తో ఫొటో దిగిన సిబ్బందిలోనూ ఉన్నారని స్థానికులు చెప్తున్నారు.

మరోవైపు మే నెలలో పుతిన్‌ను గాయపడిన సైనికుడు ఒకరు కలిశారు. ఆయన అంతకుముందు ఓ ఫ్యాక్టరీ వద్ద పుతిన్ దిగిన ఫొటోలలో ఉన్నారని ప్రజలు చెప్తున్నారు.

అయితే, ఈ రెండు సందర్భాలలో ఆ వ్యక్తి ఫొటోలను పరిశీలించినప్పుడు 25 శాతం మాత్రమే సరిపోలాయి.

రియాలిటీ చెక్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Russia: Who is this woman repeatedly seen behind Putin?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X