ప్రత్యేక విందులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వడ్డించినవి ఇవే..!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. పుతిన్ ఇప్పటికే 10 సార్లు ఇండియాను సందర్శించగా.. ఇది ఆయన 11వ పర్యటన. ఈ క్రమంలోనే ఈ రెండు రోజుల పర్యటనలో పుతిన్ కు స్వాగతం నుంచి వీడ్కోలు వరకు ఘనంగానే నిర్వహించారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ మోడీ స్వాగతం పలకడం.. ఒకే కారులో ప్రయాణించడం సహా మరెన్నో ఆసక్తికర ఘటనలు ఈ పర్యటనలో చోటు చేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి రష్యాకు పుతిన్ బయలుదేరారు. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనకు వీడ్కోలు పలికారు.
అంతే కాకుండా పుతిన్ తన ఆరోగ్యం, ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. దీంతో ఈ పర్యటనలో ఆ విషయం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా వ్లాదిమర్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు మెనూ ప్రస్తుతం వైరల్ గా మారగా.. రష్యా అధ్యక్షుడికి ఏవేమ వడ్డించారని ఆసక్తి నెలకొంది.

మెనూ ఇదే..
పుతిన్‌కు వడ్డించిన విందు పూర్తిగా శాకాహార వంటకాలతో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో దేశంలోని నలుమూలల నుంచి ఎంపిక చేసిన వంటకాలకు స్థానం కల్పించారు. మురుంగెలై చారు, గుచ్చి డూన్ చెటిన్, పుదీనా సాస్ , షీర్మల్‌తో కాలే చనే కే శికంపురి కబాబ్‌లు, ప్రసిద్ద 'జోల్ మోమో' (కూరగాయలతో నింపిన డంప్లింగ్స్)తో స్టార్టర్స్ ప్రారంభమయ్యాయి.
ప్రధాన వంటకాల్లో 'జఫ్రానీ పనీర్ రోల్', 'పాలక్ కోఫ్తా', 'గుజరాతీ దాల్', మట్టర్ కా సాగ్, తందూరీ భర్వాన్ ఆలూ, ఆచారి బైంగన్, ఎల్లో దాల్ తడ్కా, డ్రై-ఫ్రూట్ కుంకుమపువ్వు పులావ్, లచ్చా పరాఠా, మిస్సి రోటీ, మగజ్ నాన్ వంటి వివిధ రకాల రోటీలను వడ్డించారు. ఇక డెజర్ట్స్ విభాగంలో సంప్రదాయ 'బాదం కా హల్వా'తో పాటు 'సీతాఫల్ క్రీమ్'ను కూడా అందించారు. దానిమ్మ, నారింజ, క్యారెట్-అల్లం, బీట్‌రూట్ జ్యూసులు.. గోంగూర ఊరగాయ, మామిడి చట్నీ.. ఇలా ఈ వంటకాలన్నీ పుతిన్‌కు బాగా నచ్చాయని అంటున్నారు.

ఇక ఈ విందుతో పాటు సంగీత కచేరీ కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రపతి భవన్ బ్యాండ్ కళాకారులు 'వందేమాతరం', 'సారే జహా సే అచ్ఛా' వంటి భారతీయ గీతాలతో పాటు, 'కత్యుషా', 'మాస్కో నైట్స్' వంటి ప్రసిద్ధ రష్యన్ గీతాలను కూడా ఆలపించి అతిథులను అలరించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ భారత్ చూపిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విందు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బహూకరించిన ఆరు బహుమతులు కూడా హాట్ టాపిక్ గా మారాయి.

మార్బుల్ చెస్ సెట్
టీ, కేసర్
కశ్మీరీ కుంకుమపువ్వు (కేసర్).
శ్రీమద్ భగవద్గీత
సిల్వర్ టీ-సెట్
వెండి గుర్రం
ఈ బహుమతులన్నీ భారత కళలు, సంస్కృతి, భౌగోళిక వైవిధ్యాన్ని - తూర్పున బెంగాల్, పశ్చిమాన మహారాష్ట్ర, ఉత్తరాన కశ్మీర్ వరకు దేశ గొప్పతనాన్ని రష్యా అధ్యక్షుడికి అద్భుతంగా పరిచయం చేశాయి.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications