పాక్ తో సీజ్ ఫైర్ లో అమెరికా పాత్ర ఎంత ? వార్ రూమ్ చర్చలు బయటపెట్టిన జైశంకర్..!

కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ ఆపరేషన్ జోరుగా కొనసాగింది. అయితే ఉన్నట్లుండి ఐదో రోజు భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో మరో వివాదం మొదలైంది. భారత్-పాక్ కాల్పుల విరమణకూ, అమెరికాకూ సంబంధం లేదంటూ మనం చెప్తుంటే, ట్రంప్ మాత్రం తానే వాణిజ్యాన్ని అడ్డుపెట్టి యుద్ధం ఆపానని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ మరో కీలక సాక్ష్యం బయటపెట్టింది.

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న క్రమంలో అనూహ్యంగా సీజ్ ఫైర్ ఒప్పందం జరగడానికి ముందు వార్ రూమ్ లో చోటు చేసుకున్న పరిణామాల్ని విదేశాంగమంత్రి జైశంకర్ ఇవాళ బయటపెట్టారు. పాకిస్తాన్ పై భారత్ దాడులు చేస్తున్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత ప్రధాని మోడీకి ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను కూడా అదే రూమ్ లో ఉన్నట్లు జైశంకర్ తెలిపారు.

s Jaishankar reveals what happened before ceasefire call with Pakistan counter to trump

మీరు యుద్ధం ఆపకపోతే పాకిస్తాన్ మీపై తీవ్రంగా దాడులు చేయబోతోందని జేడీ వాన్ భారత ప్రధాని మోడీకి తెలిపినట్లు జైశంకర్ వెల్లడించారు. దీనికి కౌంటర్ గా తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామని ప్రధాని మోడీ వాన్స్ కు చెప్పేశారన్నారు. మే9న పాకిస్తాన్ తమపై భారీగా దాడులు చేసిందని, అయితే తాము కూడా అంతే దీటుగా వాటిని తిప్పికొట్టామని జైశంకర్ వెల్లడించారు.
ఆ తర్వాతి రోజు మళ్లీ అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మార్కూ రూబియో ఫోన్ చేసి పాకిస్తానీయులు మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారన్నారు.

s Jaishankar reveals what happened before ceasefire call with Pakistan counter to trump

ఆ మధ్యాహ్నం తరువాత, పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా నేరుగా భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు ఫోన్ చేసి కాల్పుల విరమణ కోరారన్నారు. దీంతో కాల్పుల విరమణకు తాము కూడా అంగీకరించినట్లు జైశంకర్ వెల్లడించారు. ఇందులో ట్రంప్ చెబుతున్నట్లు జోక్యం కానీ, వాణిజ్యాన్ని అడ్డుపెట్టి హెచ్చరికలు చేసిందీ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+