Sabarimala:అయప్ప భక్తుల కోసం కార్తీక దీపోత్సవం, టీడీబీ ప్రత్యేక ఏర్పాట్లు, స్వామియేశరణమయ్యప్ప!
శబరిమల/ కొచ్చి/ హైదరాబాద్: అయ్యప్పస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా బావించే కార్తీక మాసం ప్రతిరోజు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఇక కార్తీక సోమవారం రోజు శివుడి భక్తులు, అయ్యప్పస్వామి భక్తులు ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కార్తీక సోమవారం సందర్బంగా డిసెంబర్ 7వ తేదీన శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో ప్రత్యేకంగా దీపోత్సవం నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 14వ తేదీ సోమవారం అమావాస్య రావడంతో ఆరోజుతో కార్తీక మాసం పూర్తి అవుతోంది. డిసెంబర్ 7, 14వ తేదీల్లో శబరిమలలో అయ్యప్పస్వామికి ప్రత్యేక దీపోత్సవం నిర్వహించడానికి శబరిమల దేవస్వం బోర్డు కమిటీ నిర్వహకులు అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

శబరిమలలో టీడీబీ ఏర్పాట్లు
శబరిమల అయ్యప్పస్వామి తీర్థయాత్రకు వెలుతున్న భక్తులు ఎంతో నిష్టనియమాలు పాటించి మా కోరికలు, కష్టాలు తీర్చాలని స్వామిని వేడుకుంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి కేరళలోని శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిఏడాది కొన్ని లక్షల మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. కార్తీక సోమవారం దీపోత్సవం సందర్బంగా అయ్యప్పస్వామి భక్తుల కోసం శబరిమలలో తిరువాంకూరు దేవస్వం మండలి (TDB) కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

అయ్యప్ప భక్తులకు నియమాలు
శబరిమలకు ప్రతిఏడాది రెండు నెలల పాటు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. నవంబర్ 16వ తేదీన శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి ప్రతిరోజు అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల చేరుకుని సన్నిధానంలో తమ కోరికలు తీర్చాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా అయ్యప్పస్వామి భక్తులకు అనేక నియమాలు జారీ చేశారు.

కార్తీక మాసం ప్రత్యేకతలు
అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా కార్తీక మాసం ఇష్టపడతారు. హిందువులు, శివుడు, అయ్యప్ప భక్తులకు కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా అయ్యప్పను దర్శించుకోవడానికి కార్తీక మాసంలోనే వెలుతుంటారు. అలాంటి కార్తీక సోమవారం సందర్బంగా శబరిమలను చాల ప్రత్యేకంగా అలంకరించారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో రంగురంగుల పూలతో ప్రత్యేకంగా చూడముచ్చటగా అలంకరించారు.

కార్తీక మాసం చివరి సోమవారాలు
కార్తీక సోమవారం సందర్బంగా డిసెంబర్ 7వ తేదీన శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో ప్రత్యేకంగా దీపోత్సవం నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 14వ తేదీ సోమవారం అమావాస్య రావడంతో ఆరోజుతో కార్తీక మాసం పూర్తి అవుతోంది. డిసెంబర్ 7, 14వ తేదీల్లో శబరిమలలో అయ్యప్పస్వామికి ప్రత్యేక దీపోత్సవం నిర్వహించడానికి శబరిమల దేవస్వం బోర్డు కమిటీ, టీడీబీ బోర్డు నిర్వహకులు అయ్యప్ప, భక్తులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కొవిడ్ పరీక్షలు లేకుంటే వెనక్కి
శబరిమలకు ప్రస్తుతం అయ్యప్పస్వామి భక్తులు వెళ్లే సంఖ్య చాలా తక్కువకు పడిపోయింది. కరోనా వైరస్ (COVID-19) నియమాలు చాలా కఠినంగా ఉండటంతో చాలా మంది అయ్యప్పస్వామి భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న భక్తులు మాత్రమే శబరిమలలో అడుగుపెట్టడానికి అధికారులు అనుమతి ఇస్తున్నారు. చాలా మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోకుండా వెళ్లడంతో వారిని పంపాలోనే అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. ఎరిమేళి, పంపా, నీళక్కల్ ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం అయ్యప్పస్వామి భక్తుల కోసమే ప్రత్యేకంగా కొవిడ్-19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 24 గంటల ముందే అయ్యప్ప భక్తులు కచ్చితంగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాని కేరళప్రభుత్వం సూచించింది.
Recommended Video

శబరిమలలో కార్తీక దీపోత్సవం
కార్తీక సోమవారం సందర్బంగా డిసెంబర్ 7వ తేదీ సోమవారం శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంలో ప్రత్యేకంగా దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి అయ్యప్పస్వామి సన్నిధానంతో పాటు శబరిమలలోని కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులు దీపాలు వెలిగించడానికి అధికారులు అవకాశం ఇచ్చారు. కొవిడ్ నియమాల సందర్బంగా అయ్యప్పస్వామి భక్తులు ఎక్కువ సమయం సన్నిధానంలో, శబరిమలలో ఉండటానికి అధికారులు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications