సచిన్‌కు ముంబై డబ్బావాలాల సెల్యూట్: ఫోటో వేస్తారా?
ముంబై: తన 200వ టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు ముంబై డబ్బావాలాలు సెల్యూట్ చేయనున్నారు. ముంబై నగరంలో డబ్బావాలాలు ఉద్యోగస్తులకు మధ్యాహ్నం ఇంటి నుంచి లంచ్ బాక్స్‌ను తీసుకు వెళ్తుంటారు.
ఈ డబ్బావాలాలు సచిన్ వాంఖేడేలో ఆడనున్న ఆఖరు, 200 టెస్టు మ్యాచ్ సందర్భంగా సెల్యూట్ చేయనున్నారు. ముంబైకి చిహ్నంగా నిలిచిన సచిన్ భారతీయులందరూ గర్వపడేలా చేశారని కాబట్టి ఆయన రిటైర్మెంట్ సమయంలో యాభై నుండి వందమంది డబ్బావాలాలు సెలవు పెట్టి స్టేడియానికి వెళ్తారని డబ్బావాలాల ట్రస్ట్ ప్రతినిధులు చెప్పారు.

ముంబైలో డబ్బావాలాలు 123 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. కాగా, భారత క్రికెట్‌కు మాస్టర్ సచిన్ టెండుల్కర్ రెండున్నర దశాబ్దాలు సేవలు అందించారు.
టిక్కెట్ పైన సచిన్ ఫోటో వేస్తారా?
కోల్‌కతాలో సచిన్ ఆడనున్న 199వ టెస్టు మ్యాచ్ టిక్కెట్‌ల పైన సచిన్ టెండుల్కర్ ఫోటోను వేయాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఉబలాటపడుతోంది. ఇందుకోసం బిసిసిఐ అనుమతిని కోరింది. కోల్‌కతాలో జరగనున్న టెస్టు మ్యాచ్ కోసం టిక్కెట్లను ఈ నెల 25వ తేదీ నుండి క్యాబ్ అమ్మనుంది. 68,000 సీట్లు స్టేడియంలో ఉన్నాయి. టిక్కెట్లను 29 నుండి ఇవ్వనున్నారు. కాగా, ఈడెన్ గార్డెన్‌లో నవంబర్ 6-10 వరకు మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.












Click it and Unblock the Notifications