క్లీన్‌ఇండియా: మోడీని కలిసిన సచిన్ టెండూల్కర్(ఫొటో)
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దంపతులు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. స్వచ్ఛ భారత్(క్లీన్ ఇండియా) కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై మోడీతో సచిన్ తన అభిప్రాయాలను పంచుకుంటున్నట్లు తెలిసింది.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. మోడీ పిలుపు మేరకు సచిన్ టెండూల్కర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముంబై వీధులను శుభ్ర పర్చారు.

ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి ప్రధాని మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విస్తృతపర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని సచిన్ టెండూల్కర్.. మోడీకి తెలిపినట్లు తెలిసింది. ఇతర ప్రముఖులను కూడా కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తానని చెప్పినట్లు సమాచారం.
<blockquote class="twitter-tweet blockquote" lang="en-gb"><p>With <a href="https://twitter.com/sachin_rt">@sachin_rt</a>. <a href="http://t.co/GO6eCRuHqw">pic.twitter.com/GO6eCRuHqw</a></p>— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/522678072458219520">October 16, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింద తాను ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని సచిన్ టెండూల్కర్ చెప్పారు. అంతేగాక అక్కడ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల తన పిలుపు మేరకు చీపురు పట్టి వీధులను శుభ్రం చేసిన సచిన్ టెండూల్కర్‌కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.
‘మీరు చాలా గొప్ప పని చేశారు. మీ శ్రమ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని బలపర్చేవిధంగా ఉంది' అని సచిన్ టెండూల్కర్‌ను మెచ్చుకుంటూ మోడీ ట్వీట్ చేశారు. సచిన్‌ను స్ఫూర్తిగా తీసుకుని అందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని మోడీ మరోసారి పిలుపునిచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడం పట్ల సచిన్‌కు మోడీ అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications