సచిన్‌దే వరస్ట్ రికార్డ్!, ఇలాంటి వాళ్లొద్దని ఎంపీల విమర్శ

న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడిగా ప్రశంసలు అందుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్... ఇప్పుడు, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సచిన్ ఖాతాలో టన్నుల కొద్దీ పరుగులు, క్రికెట్‌లో రికార్డుల మోత. అలాంటి సచిన్‌ను యూపీఏ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.

2012 జూన్‌లో రాజ్యసభ సభ్యునిగా సచిన్ ప్రమాణ స్వీకారం చేశాడు. క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన సచిన్, రాజకీయాల్లో మాత్రం నేతల విమర్శలను ఎదుర్కొన్నారు. సచిన్ పార్లమెంటుకు హాజరయ్యింది చాలా తక్కువ. కాంగ్రెస్ ఎంపీల్లో తక్కువ రోజులు హాజరైన వారిలో సచిన్ ముందున్నారు.

ఎంపీగా సచిన్ పార్లమెంటులో హాజరు 3 శాతం మాత్రమే. దీంతో, సచిన్ పైన పలువురు నేతలు విమర్శలు కురిపించారు. రిటైరైన తర్వాత కూడా సచిన్ పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే, సచిన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా సభకు రాలేదు!

Sachin Tendulkar yet to attend Parliament this year

2013లో మొత్తంగా సచిన్ పార్లమెంటుకు మూడుసార్లు హాజరయ్యారు. అప్పుడు కూడా సభలో చర్చలో పాల్గొనులేదు. సమాజాన్ని మారుస్తారని వీళ్లను ఎంపీలుగా చేస్తే, ఒక్కసారి కూడా సభలో కనిపించడం లేదని సమాజ్‌వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ అన్నారు.

ఎవరైతే పార్లమెంటుకు హాజరయ్యే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారో.. వారిని నామినేట్ చేయవద్దని నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ ఎంపీ త్రిపాఠి చెప్పారు. ఇలాంటి వారిని పార్లమెంటుకు నామినేట్ చేయడం సిగ్గుపడాల్సిన విషయమన్నాడు.

భారత పార్లమెంటేరియన్లలో చాలామంది సభకు గైర్హాజరవుతుంటారు. అందులో సచిన్ రికార్డ్ మరీ వరస్ట్‌గా ఉంది. పోయిన ఏడాది కేవలం మూడు శాతం మాత్రమే ఉంది. గత నవంబరులో రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ ఏడాది సచిన్ సభకు వస్తాడని అందరు భావించారు. చాలామంది నేతలు సచిన్ పేరు ఎత్తే ధైర్యం చేయడం లేదు అయితే పరోక్షంగా అతని తీరును తప్పు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+