వరదల్లో ఈషా ఫౌండేషన్ సభ్యులు 80 మంది గల్లంతు - సద్గురు ప్రత్యేకంగా.!!
నేపాల్ వరదల్లో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. పలువురు గల్లంతు అయ్యారు. ఈ వరదల్లో భారత్ నుంచి అనేక మంది చిక్కుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటంతో రెండు ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వరదల్లో 80 మంది ఇషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతయ్యారు. ఈ మేరకు ఇషా ఫౌండేషన్ తెలిపింది. వారి కీ లభించలేదని ఇషా ఫౌండేషన్ పేర్కొంది. నేపాల్ వెళ్లిన ఇషా ఫౌండేషన్ బృందంలో కొందరు గల్లంతు కాగా, మరికొందరు సురక్షితంగా ఉన్నారు.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతంలో సంభవించిన వరదల్లో ఇషా ఫౌండేషన్ సభ్యులు 80 మంది ఆచూకీ తెలియటం లేదు. దీంతో.. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో 77 మంది యాత్రికులు గ్యిరాంగ్‌లోని ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా వరదలు రావడంతో వారితో సంబంధాలు తెగిపోయాయన్నారు.

ప్రస్తుతం తాను సాగా ప్రాంతంలో ఉన్నానని, వరద ప్రభావిత గ్యిరాంగ్‌కు వెళ్లేందుకు అనుమతి లభిస్తే గల్లంతైన వారి కోసం గాలింపులో సహకరిస్తామని సద్గురు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది చేస్తున్న సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని సద్గురు స్పష్టం చేశారు.
తమవారి కుటుంబాలకు ఏదైనా సమాచారం అందించేందుకు, గాలింపు చర్యల్లో తమ వంతు సహాయం చేసేందుకు అనుమతించాలని చైనా అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇషా ఫౌండేషన్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 21 బృందాలు కైలాష్ యాత్రలో పాల్గొన్నాయి. వారిలో 495 మంది సురక్షితంగా తిరిగి వచ్చారు. 743 మంది టిబెట్‌లో, 148 మంది నేపాల్‌లో ఉండిపోయారు.
వారిలో 77 మంది గ్యిరాంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉండగా భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో వారి గురించి సమాచారం లేకుండా పోయింది. కాగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఈ వరదల్లో చిక్కుకున్నారు. వీరి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి. కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నాయి. తమ రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి వివరాలు సేకరించి.. వారి పరిస్థితి పైనా ఆరా తీస్తున్నాయి.













Click it and Unblock the Notifications