'షారుక్‌ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్, దేశం విడిచి వెళ్లవచ్చు'
లక్నో: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పైన విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాద్వీ ప్రాచీ సోమవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్ అని ఆరోపించారు. ఆయనకు నచ్చకుంటే దేశం విడిచి వెళ్లిపోవచ్చునని విరుచుకుపడ్డారు.
అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న షారుక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. షారుక్ వ్యాఖ్యలు తీవ్రమైనవన్నారు. అలాగే, అవార్డులు వెనక్కి ఇస్తున్న వారి పైన కూడా ఆమె మండిపడ్డారు. అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారు ఎందుకు ఇస్తున్నారో తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు.
సాద్వీ ప్రాచీ గతంలోను షారుక్ ఖాన్ పైన మండిపడిన సందర్భాలు ఉన్నాయి. బాద్ షా సినిమాలు చూడ్డానికి వీల్లేదని ఆమె గతంలో అన్నారు. షారుక్ ఖాన్ సినిమాల వల్ల యువత పెడదోవ పడుతోందన్నారు.

అవార్డులు వెనక్కి ఇస్తున్న వారిపై వెంకయ్య ఆగ్రహం
దేశంలో సహనశీలత తగ్గిందని కాంగ్రెస్ ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం మండిపడ్డారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలనేది ఈ శతాబ్దపు జోక్ అన్నారు. దేశంలో ప్రజల హక్కులు హరించిందెవరని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలను జైల్లోకి నెట్టింది, ఎమర్జెన్సీని విధించింది ఎవరని నిలదీశారు. మతోన్మాద శక్తులను పెంచి పోషించిన కాంగ్రెస్ ఇప్పుడు సహలశీలత గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. కాశ్మీర్ పండిట్లను, సిక్కులను ఊచకోత కోసినప్పుడు కాంగ్రెస్ ఎక్కడుందన్నారు.
-
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
ధురంధర్-2 పై RGV రివ్యూ.. షోలే కంటే 100 రెట్లు గొప్పగా.. స్పీల్ బర్గ్, నోలన్ సైతం.. -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications