
Sadist: గోమాతతో గేమ్స్ ఆడిన కిరాతకుడు, హీరో లా ఫీలైపోయి చితకబాదేశాడు, వీడియో వైరల్, దౌడ్ !
కాన్పూర్: వ్యవసాయ పోలాలు ఉన్న గ్రామం సమీపంలో గోసంరక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. గోసంరక్షణా కేంద్రంలో సుమారు 40కి పైగా గోవులు ఉన్నాయి. ప్రతిరోజు గోవులకు అవసరమైన గడ్డి, తౌడుతో కుడితి, తాగునీరు అందించడానికి అక్కడ పని వాళ్లు ఉన్నారు. ప్రతిరోజు గోవులను ఇద్దరు ముగ్గురు చూసుకుంటున్నారు. అయితే వారం రోజుల క్రితం ఏం జరిగిందో ఏమో కాని గోసంరక్షణా కేంద్రంలోని గోవులు కొన్ని బయటకు వచ్చేశాయి. కొన్ని గోవులు పరిసర ప్రాంతాల్లోని పొలాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సందర్బంలో సమీపంలోని పొలంలో గోధుముల పంట వేసిన ఓ వ్యక్తి అతని పంట నాశనం అయిపోయిందని రగిలిపోయాడు. పెద్ద కర్ర తీసుకున్న ఆ వ్యక్తి ఓ గోవును పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నోరులేని మూగజీవి అని కనికరం లేకుండా గోవును చితకబాదేశాడు. దెబ్బలు తట్టుకోక ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరుగు తీసింది. అయితే పశువులాగా రెచ్చిపోయిన ఆ వ్యక్తి ఆ కర్ర విరిగిపోయే వరకు ఆ గోవును కొన్ని నిమిషాల పాటు వెంబడించి చితకబాదేశాడు. ఆ సమయంలో ఆ కిరాకతుడు గోవు మీద దాడి చేసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. జంతువులను హింసించాడని అతని మీద కేసు నమోదు కావడంతో ఆ కిరాతకుడు పరుగో పరుగు అంటూ పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నాడు.
Illegal affair: భర్త ఫ్రెండ్ తో భార్య ?, ఓపిక నసించిపోయిన భర్త ఏం చేశాడంటే, శుభం కార్డు!

పచ్చటి పొలాల పక్కలో గోశాల
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని నార్వార్ ప్రాంతాలో పచ్చటి పొలాలు ఎక్కువగా ఉంటాయి. నార్వార్ గ్రామం సమీపంలోని వ్యవసాయ పోలాల సమీపంలో తాత్కాలికంగా గోసంరక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోసంరక్షణా కేంద్రంలో సుమారు 40కి పైగా గోవులు ఉన్నాయి.

ఆ రోజు ఏం జరిగిందంటే ?
ప్రతిరోజు గోశాలలోని గోవులకు అవసరమైన గడ్డి, తౌడుతో కుడితి, తాగునీరు అందించడానికి అక్కడ పని వాళ్లు ఉన్నారు. ప్రతిరోజు గోవులను ఇద్దరు ముగ్గురు చూసుకుంటున్నారు. అయితే జనవరి 16వ తేదీన ఏం జరిగిందో ఏమో కాని గోసంరక్షణా కేంద్రంలోని గోవులు కొన్ని బయటకు వచ్చేశాయి. కొన్ని గోవులు పరిసర ప్రాంతాల్లోని పొలాల్లోకి వెళ్లిపోయాయి.

పశువులాగా రెచ్చిపోయిన కిరాతకుడు
ఆ సందర్బంలో సమీపంలోని పొలంలో గోధుముల పంట వేసిన శ్యాము కుష్వాహా అనే వ్యక్తికి కాలిపోయింది. పెద్ద కర్ర తీసుకున్న శ్యాము కుష్వాహా ఓ గోవును పట్టుకుని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నోరులేని మూగజీవి అని కనికరం లేకుండా శ్యాము కుష్వాహా గోవును చితకబాదేశాడు. దెబ్బలు తట్టుకోక ఆ గోవు అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరుగు తీసింది. అయితే పశువులాగా రెచ్చిపోయిన శ్యాము కుష్వాహా ఆ కర్ర విరిగిపోయే వరకు ఆ గోవును వెంబడించి చితకబాదేశాడు.

వీడియో వైరల్..... కిరాతకుడు పరుగోపరుగు
ఆ సమయంలో కిరాకతుడు శ్యాము కుష్వాహా గోవు మీద దాడి చేసే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. జంతువులను హింసించాడని తెలుసుకున్న పోలీసు అధికారులు శ్యాము కుష్వాహా మీద కేసు నమోదు చేసి అతని ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే శ్యాము కుష్వాహాకు మ్యాటర లీక్ అయిపోయి ఆ కిరాతకుడు పరుగో పరుగు అంటూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. మొత్తం మీద నోరులేని మూగజీవి, పాలు ఇచ్చే గోమాతను ఇలా దాడి చేసిన శ్యాము కుష్వాహాను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.