Sadist: రెండో భార్యతో ఎంజాయ్, ఫస్ట్ భార్య గర్బవతి, దిపావళి టైమ్ లో భార్యకు నిప్పంటించిన భర్త !

థానే/ముంబాయి: భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త మరో మహిళ మోజులో పడిపోయాడు. వేరే మహితో ఎంజాయ్ చేస్తున్న భర్త ఇంట్లో అతని భార్యకు అప్పుడప్పుడు నరకం చూపిస్తున్నాడు. ఇటీవల భర్త ఆగడాలు ఎక్కువ అయ్యాయని సమాచారం. తరువాత వేరే మహిళను వివాహం చేసుకున్న భర్త ఆమెతో కూడా కాపురం చేస్తున్నాడు. రెండో భార్యతో ఎక్కువ ఎంజాయ్ చేస్తున్న అతను మొదటి భార్యతో అప్పుడప్పుడు కాపురం చేస్తున్నాడు. మొదటి భార్య ప్రస్తుతం గర్బవతి. దీపావళి పండుగ సందర్బంగా ఇంట్లో దీపాలు వెలిగించి పండుగ చేసుకోవాల్సిన మొదటి భార్య ఇప్పుడు ఆసుపత్రిపాలైయ్యింది. ఇంట్లో ఉన్న మొదటి భార్య గర్బవతి అని కనికరం లేకుండా ఆమెకు నిప్పంటించిన భర్త ఆమెను సజీవదహనం చెయ్యాలని ప్రయత్నించడం కలకలం రేపింది.

 మొదటి భార్యతో మొదట ఎలా ఉన్నాడంటే ?

మొదటి భార్యతో మొదట ఎలా ఉన్నాడంటే ?

ముంబాయి సమీపంలోని థానేలో అనీల్ చౌరాసి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 35 సంవత్సరాల వయసు ఉన్న రష్మీ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను అనీల్ కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన కొత్తలో అనీల్ అతని భార్య రష్మీతో సంతోషంగానే కాపురం చేశాడు.

 పరాయి మహిళ మోజులో పడిన భర్త

పరాయి మహిళ మోజులో పడిన భర్త

భార్య రష్మీతో సంతోషంగా కాపురం చేస్తున్న ఆమె భర్త అనీల్ మరో మహిళ మోజులో పడిపోయాడు. భార్యను ఇంట్లో పెట్టుకుని పరాయి మహిళతో కులుకుతున్న అనీల్ చెడువ్యసనాలకు బానిసలు అయ్యాడని సమాచారం. వేరే మహితో ఎంజాయ్ చేస్తున్న అనీల్ ఇంట్లో అతని భార్య రష్మీకి అప్పుడప్పుడు నరకం చూపిస్తున్నాడు. ఇటీవల ఇంట్లో అనీల్ ఆగడాలు ఎక్కువ అయ్యాయని సమాచారం.

 ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్న భర్త

ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకున్న భర్త

మొదటి భార్య రష్మీతో గొడవపడుతున్న సమయంలో ఇంతకాలం ఎంజాయ్ చేస్తున్న ఆ మహిళను అనీల్ వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతో ఎక్కువగా కాలం గడుపుతున్న అనీల్ మొదటి భార్య రష్మీతో కూడా కాపురం చేస్తున్నాడు. రెండో భార్య మోజులో పడిపోయిన అనీల్ అతని మొదటి భార్యతో కూడా అప్పుడప్పుడు కాపురం చేస్తున్నాడు.

 దీపావళి పండుగ సమయంలో భర్త ఏం చేశాడంటే ?

దీపావళి పండుగ సమయంలో భర్త ఏం చేశాడంటే ?

అనీల్ మొదటి భార్య రష్మీ ప్రస్తుతం 6నెలల గర్బవతి. దీపావళి పండుగ సందర్బంగా ఇంట్లో దీపాలు వెలిగించి పండుగ చేసుకోవాల్సిన మొదటి భార్య రష్మీ మీద ఆమె భర్త అనీల్ రగిలిపోయాడు. ఇంటికి వెళ్లిన అనీల్ అతని మొదటి భార్య రష్మీతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత సహనం కోల్పోయిన అనీల్ అతని భార్య రష్మీ మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

 కడుపులో బిడ్డ ప్రాణం పోయింది

కడుపులో బిడ్డ ప్రాణం పోయింది

తీవ్రగాయాలైన రష్మీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మొదటి భార్య రష్మీ గర్బవతి అని కనికరం లేకుండా అనీల్ ఆమెకు నిప్పంటించి సజీవదహనం చెయ్యాలని ప్రయత్నించడం కలకలం రేపింది. భార్యను చంపడానికి ప్రయత్నించిన అనీల్ ప్రస్తుతం పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని థానే పోలీసు అధికారులు అన్నారు. తీవ్రగాయాలైన అనీల్ భార్య ఆసుపత్రిలో కోలుకుంటున్నదని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు. అనీల్ కు అతని కుటుంబ సభ్యులు ఏమైనా మద్దతు ఇస్తున్నారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న భార్య తన భర్త అనీల్ నాకు నిప్పంటించాడని స్టేట్ మెంట్ ఇచ్చిందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+