‘కాక్’కామెంట్ల దుమారం.. సిద్దార్థ్‌పై మాటల దాడి, సైనా కూడా రిప్లై
బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్దార్థ్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఏకంగా జాతీయ మహిళా కమిషన్ సిద్దార్థ్‌కు నోటీసులు జారీ చేసింది. గత వారం ప్రధాని మోడీ పంజాబ్‌లోని ఒక సభలో పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడింది. దానిని ఉద్దేశిస్తూ సైనా నెహ్వాల్ ఒక ట్వీట్ చేశారు. ప్రధాని మోడీకే భద్రత లేకుంటే దేశం సురక్షితమైనదని చెప్పలేం. ప్రధానిపై అరాచకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేసింది. దీనికి సిద్దార్థ్ రీ ట్వీట్ చేశాడు. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్. థాంక్ గాడ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా..షేమ్ యూ రిహన్నా అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.
సైనాను ''కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్ '' అనడంతో ఆ ట్వీట్‌పై దుమారం రేగింది. సిద్దార్థ్ చేసిన ట్వీట్‌ను పలువురు ఖండించారు. శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది తప్పుపట్టారు. సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సిద్దార్థ్‌కు వ్యతిరేకంగా గళమెత్తింది. సిద్దార్థ్ ఇది చాలా దారుణం. మీటూ ఉద్యమంలో అనేక మంది మహిళలకు మద్దతుగా మాట్లాడారు. కాక్ చాంఫియన్ ఆఫ్ ది వరల్డ్ అనే పదానికి మరో అర్థం ఉంది. సైనాను ఆ పదంతో సంబోధించడం అవమానకరం అని ట్వీట్ చేసింది.

అభిప్రాయం చెప్పడం తప్పు కాదు. కానీ, చెప్పేటప్పుడు సరైన పదాలు ఉపయోగించాలి అని కశ్యప్ట్వీట్ చేశాడు. దీంతో జాతీయ మహిళా కమిషన్ సిద్దార్థ్‌కు నోటీసులు జారీ చేసింది. సిద్దార్థ్‌పై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఛైర్ పర్సన్ రేఖా శర్మ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశారు. ట్వీట్ వివాదస్పదం కావడంతో సిద్దార్థ్ రిప్టై ఇచ్చాడు. కాక్, బుల్‌కు మీరు తేడా తెలుసుకోవాలి.. లేదంటే చదివేటప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉంది. ఎవరిని అవమానపరచాలనే ఉద్దేశం నాకు లేదని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.
హీరో సిద్దార్థ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సైనా నెహ్వాల్ స్పందించింది. ఆయన ఏం ట్వీట్ చేశారో తెలియదు. నటుడిగా అతడంటే తనకు ఇష్టం. అతడు తన అభిప్రాయాన్ని మంచి పదాలతో వ్యక్తం చేస్తే బాగుండేది. ట్విట్టర్‌లో ఇలాంటి కామెంట్లతో గుర్తింపు వస్తుందని సిద్దార్థ్ అనుకుంటున్నారు. ప్రధాని భద్రతే సమస్య అయితే.. దేశంలో ఏది భద్రమయిందో తనకు తెలియదని సైనా నెహ్వాల్ తెలిపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications