Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ములాయం సింగ్ యాదవ్ కు సతీ వియోగం-భార్య సాధనా గుప్తా కన్నుమూత

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య సాధనా గుప్తా ఇవాళ చనిపోయారు. అనారోగ్యం కారణంగా మేదాంత ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ కన్నుమూశారు. దీంతో సమాజ్ వాదీ పార్టీలో విషాదం నెలకొంది.

ములాయం రాజకీయాల్లో చురుగ్గా ఉండే రోజుల్లో ఆయనతో ప్రయాణం మొదలుపెట్టిన సాధనా గుప్తా చాలా రోజుల పాటు రహస్యంగానే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య అయిన సాధనా గుప్తా 2003 తర్వాతే అందరికీ పరిచయమయ్యారు. అఖిలేష్ యాదవ్ తల్లి మాలతీ యాదవ్ చనిపోయిన తర్వాత ఆమె బయటికి కనిపించారు. మాలతి మృతి తర్వాత సాధనా గుప్తాను ములాయం బహిర్గతం చేశారు. ఆ తర్వాత నుంచి అందరికీ కనిపించిన సాధనా గుప్తా పార్టీ వ్యవహారాల్లో మాత్రం దూరంగా ఉండేవారు. ఇప్పుడు ఆమె మృతితో ములాయం కుటుంబంలో విషాదం చోటు చేసుకున్నట్లయింది.

Samajwadi Party Founder Mulayam Singh Yadavs wife Sadhna Gupta passes away

సాధనా గుప్తా మృతిపై యోగీ సర్కార్ లో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం ప్రకటించారు. మాజీ సీఎం ములాయం భార్య మృతిపై స్పందించిన మౌర్య.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా చనిపోయారన్న విషాద వార్త అందింది. ఆమెకు దేవుడు స్వర్గం ప్రసాదించాలని, అలాగే ములాయం కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని మౌర్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+