ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో పీకల్లోతు కష్టాల్లో సమీర్ వాంఖడే .. ఎన్సీబీని షారూక్ ఖాన్ కూడా టార్గెట్ చేస్తారా?
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఎట్టకేలకు తన నిశ్శబ్దాన్ని ఛేదించబోతున్నాడా? అతని న్యాయ బృందం తిరిగి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోపై యుద్ధం చెయ్యాటానికి సిద్ధమవుతోందా? అంటే అవును అన్న సమాధానం వస్తుంది. దాదాపు ఒక నెల జైలు శిక్ష తర్వాత షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 28న కస్టడీ నుండి విడుదల చేస్తూ వచ్చిన బెయిల్ ఆర్డర్, ఆర్యన్ అరెస్టుకు సరైన కారణం లేదని స్పష్టం చేయటంతో షారూక్ ఖాన్ తన కుమారుడిని ముప్పతిప్పలు పెట్టిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే పై రివెంజ్ తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారని సమాచారం .

హైకోర్టు బెయిల్ ఆర్డర్ తో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో క్లారిటీ
ముంబై హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు సంబంధించిన బెయిల్ ఆర్డర్ లో నిందితులైన ఆర్యన్ ఖాన్ తో పాటు డ్రగ్స్ కేసులో ఉన్న వారిలో ఎవరిపై డ్రగ్స్ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లేవని, ఉమ్మడి ఉద్దేశ్యంతో చట్టవిరుద్ధమైన చర్యకు అంగీకరించారని ఈ కోర్టును ఒప్పించేందుకు ఎటువంటి సానుకూల సాక్ష్యం రికార్డులో లేదని, కేవలం ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచా అదే క్రూయిజ్‌లో ప్రయాణించారని, అది వారిపై కుట్ర అభియోగానికి సాక్ష్యంగా పరిగణించబడదని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ నిత్యం డ్రగ్స్ తీసుకుంటాడని, ఆర్యన్ ఖాన్ వాట్సప్ చాట్ లలో డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి అంతర్జాతీయ లింక్స్ ఉన్నాయని చేసిన ఆరోపణలను కూడా కోర్టు సరైన ఆధారాలు లేవని పేర్కొంది. వాట్సప్ చాట్ లను సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది.

ఆర్యన్ ఖాన్ ను టార్గెట్ చేసిన సమీర్ వాంఖడే పై ప్రతీకారం తీర్చుకోనున్న షారూక్ ఖాన్
అయితే ఆర్యన్‌ను ఎందుకు అరెస్టు చేశారు? ఆర్యన్ మరియు అతని స్నేహితుల అరెస్ట్‌కు సూత్రధారి అయిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్స సమీర్ వాంఖడేని షారుఖ్ ఖాన్ లీగల్ టీమ్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికే షారూక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. లంచం ఆరోపణలతో ఈ కేసు నుండి ఆయన తొలగించబడ్డారు. ఆయనపై ఎన్సీబీ విజిలెన్స్ విచారణ సాగిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో సైలెంట్ గా ఉన్న షారుక్ ఖాన్ ఈ కేసులో తన కుమారుని కటకటాల వెనక్కి నెట్టిన వారిపై ప్రతీకార చర్య తీసుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఆర్యన్ ఖాన్ కేసుతో ఇరుక్కున్న సమీర్ వాంఖడే .. కొత్త మలుపు తిరిగిన కేసు
దీనికోసం ఆర్యన్ ఖాన్ న్యాయవాదుల బృందం రెడీ అవుతున్నట్లు సమాచారం. షారూక్ ఖాన్ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సమీర్ వాంఖడే పై న్యాయ పోరాటానికి దిగాలని భావిస్తున్న నేపధ్యంలో ఈ కేసులో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం .ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించడం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో డీల్ జరిగిందని, సమీర్ వాంఖడే కు ఎనిమిది కోట్లు డబ్బులు చెల్లించాలని చర్చ జరిగిందని కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సెయిల్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అఫిడవిట్ ఇవ్వటం, ఆపై సామ్ డిసౌజా లంచం వ్యవహారంపై సంచలన విషయాలు వెల్లడించటం వెరసి ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
Recommended Video

సమీర్ వాంఖడే పై మహారాష్ట్ర మంత్రి సంచలనాలు, షారూక్ కూడా రంగంలోకి దిగుతారా ?
డిసౌజా తాను అక్టోబర్ 3 తెల్లవారుజామున దడ్లానీ మరియు గోసావి మధ్య ఒక ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశానని చెప్పాడు. దడ్లానీ, ఆమె భర్త, గోసావి, తాను మరికొందరు అక్టోబర్ 3 వ తేదీన ఉదయం 4 గంటలకు లోయర్ పరేల్‌లో కలుసుకున్నామని చెప్పాడు. గోసావి దడ్లానీ నుండి రూ. 50 లక్షలు తీసుకున్నాడని లంచం వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెల్లడించటంతో పాటు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే పై అనేక సంచలన ఆరోపణలు చెయ్యటం , సంచలన వీడియోలు విడుదల చెయ్యటం వెరసి సమీర్ వాంఖడే గట్టిగానే ఈ కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా బెయిల్ రానివ్వకుండా చేసిన సమీర్ వాంఖడేపై షారూక్ ఖాన్ ఏం చెయ్యబోతున్నారు అన్నది ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications