వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమీర్ వాంఖడే పై నేడు ఎన్సీబీ విజిలెన్స్ టీమ్ విచారణ; ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఉచ్చులో వాంఖడే విలవిల!!

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి పలు ఆరోపణలు ఎదుర్కొన్న సమీర్ వాంఖడే పై విచారణ చేపట్టింది ఎన్సీబీ. లంచం ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఐదుగురు సభ్యుల బృందం నేడు ముంబైలో విచారణ చేపట్టనుంది.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదుఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు

లంచం ఆరోపణలపై సమీర్ వాంఖడేతో పాటు పలువురిపై దర్యాప్తు

లంచం ఆరోపణలపై సమీర్ వాంఖడేతో పాటు పలువురిపై దర్యాప్తు

సమీర్ వాంఖడేతో సహా చాలా మంది పాత్రలను విజిలెన్స్ బృందం విచారించనుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలు తెలిపాయి. సమీర్ వాంఖడే ను, ప్రభాకర్ సెయిల్‌తో పాటు లంచం ఆరోపణలలో ఉన్న పలువురు సభ్యులను టీమ్ ప్రశ్నించనుంది. డీడీజీతో పాటు జోనల్ డైరెక్టర్, సూపరింటెండెంట్ స్థాయిలో నలుగురు అధికారులు వీరిని విచారించే బృందంలో ఉన్నారు. వీరు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులపై వచ్చిన ఆరోపణలపై, ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించడానికి 25 కోట్లు లంచం డిమాండ్ చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేయనున్నారు.

 సమీర్ వాంఖడే పై విజిలెన్స్ విచారణ చేపట్టిన ఎన్సీబీ

సమీర్ వాంఖడే పై విజిలెన్స్ విచారణ చేపట్టిన ఎన్సీబీ

ఆర్యన్‌ఖాన్‌ను విడుదల చేసేందుకు కేపి గోసావి ద్వారా రూ.25 కోట్లు లంచం అడిగారని ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఆరోపించడంతో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, తాము ఆరోపణలపై (సమీర్ వాంఖడేపై) విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖడే పదవిలో కొనసాగుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఈ సమయంలో చెప్పటం సాధ్య కాదని ఆయన వెల్లడించారు.

ఇప్పటికే ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ కు వివరణాత్మక నివేదిక పంపిన ముంబై ఎన్సీబీ

ఇప్పటికే ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ కు వివరణాత్మక నివేదిక పంపిన ముంబై ఎన్సీబీ


ఇదిలా ఉంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పై వచ్చిన ఆరోపణలపై ముంబై ఎన్‌సిబి అధికారులు ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్‌కు వివరణాత్మక నివేదికను సమర్పించారు. ఇక కోర్టులో సైతం సమీర్ వాంఖడే తనపై వచ్చిన ఆరోపణలకు అఫిడవిట్ దాఖలు చేశారు. తాను నిరపరాధి అని డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన ఉద్యోగాన్ని, ఆయన కులాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. నార్కోటిక్స్ వర్గాల సమాచారం ప్రకారం, వాంఖడేపై విజిలెన్స్ దర్యాప్తు యొక్క అంతర్గత దర్యాప్తును కూడా ఎన్‌సిబి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అయిన డిడిజి జ్ఞానేశ్వర్ సింగ్‌కు అప్పగించారని సమాచారం.

సమీర్ వాంఖడేపై లంచం ఆరోపణలు .. డిఫెన్స్ లో వాంఖడే

సమీర్ వాంఖడేపై లంచం ఆరోపణలు .. డిఫెన్స్ లో వాంఖడే

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో తాజా పరిణామాలతో ఎన్సీబీ అధికారులలో సైతం టెన్షన్ మొదలైంది. సాక్షి ప్రభాకర్ సెయిల్ అఫిడవిట్ ఈ కేసులో కీలక మలుపు తిరగడానికి కారణమైంది. షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ ను విడుదల చేసేందుకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తరపున రూ. 25 కోట్లు లంచం డిమాండ్‌ చేశాడని కేసులో మరో సాక్షి కేపీ గోసవి అంగరక్షకుడు ప్రభాకర్‌ సెయిల్‌ పేర్కొన్నారు. ప్రతిస్పందనగా, సమీర్ వాంఖడే ఆరోపణను ఖండించారు. తనపై కుట్ర జరుగుతుందని, కావాలనే ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, కేసును తప్పుదారి పట్టిస్తున్నారని, చట్టపరమైన చర్యల నుండి రక్షణ కోరుతూ ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు.

 నార్కోటిక్స్ విచారణ బృందం కార్యాచరణ ఇలా ..

నార్కోటిక్స్ విచారణ బృందం కార్యాచరణ ఇలా ..

ఇదిలా ఉంటే బుధవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజిలెన్స్ బృందం యొక్క కార్యాచరణ ప్రణాళిక ఈ విధంగా ఉంది. బుధవారం ఐదుగురు సభ్యుల బృందం ఉదయం 11.30 గంటలకు ముంబై చేరుకుంటుంది. విచారణ బృందం అతిథి గృహంలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని విచారణ సాగిస్తుంది. ఈ బృందం ముంబై ఎన్‌సిబి కార్యాలయాన్ని సందర్శించి దాని క్యాంపు కార్యాలయానికి వెళ్తారు బృందం సభ్యులు . అక్కడ వారు రాబోయే రోజుల్లో సంబంధిత వ్యక్తులను ఒక్కొక్కరిగా పిలుస్తారు. వారు ఈ వ్యవహారంలో ఏం చెప్తారో తెలియాల్సి ఉంది.

 ఆర్యన్ ఖాన్ కేసులో కీలక ఆరోపణలు, షాకింగ్ వీడియోలు

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక ఆరోపణలు, షాకింగ్ వీడియోలు


లంచం కేసుకు సంబంధించి కేపీ గోసావి ఆర్యన్ ఖాన్ తో కలిసి అధికారులతో డీల్ మాట్లాడినట్టు కూడా ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో కేపీ గోసావి చేతిలో ఉన్న ఫోన్ లో ఆర్యన్ ఖాన్ ఏదో చెప్తున్నట్టు ఉంది. ఇక ఈ కేసులో రోజుకో కీలక అంశాలు, షాకింగ్ వీడియోలు బయటకు రావటంతో నార్కోటిక్స్ బ్యూరో విచారణపై ఆసక్తి నెలకొంది. ఈ బృందం జాబితాలో పేర్కొన్న వ్యక్తులను ప్రశ్నించి వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తుంది.

Recommended Video

TTDP Mouna Deeksha: చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా TTDP నేతల మౌన దీక్ష
 విజిలెన్స్ బృందం విచారించేది వీరినే

విజిలెన్స్ బృందం విచారించేది వీరినే

ఈ కేసులో ఆరోపణలు చేసిన స్వతంత్ర సాక్షి అయిన ప్రభాకర్ సెయిల్ ను, మరో స్వతంత్ర సాక్షి కెపి గోసావిని, ఆరోపణలు చేయబడిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను, ఇక వ్యాపారవేత్త, గోసావి స్నేహితుడు శామ్ డిసౌజా ను, షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీని విచారించనున్నారు. ఈరోజు ఒకపక్క నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులపై విజిలెన్స్ విచారణ , మరోపక్క బొంబాయి హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

English summary
A five-member team of the NCB headed by Deputy Director General Gnaneshwar Singh will hold an inquiry in Mumbai today in the wake of allegations of bribery by NCB Zonal Director Sameer Wankhede in the Aryan Khan drugs case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X