Sandalwood:టాప్ హీరోయిన్లు డ్రగ్స్ సేవించారు, హైదరాబాద్ ఫోరెన్సిక్ రిపోర్టు, కొత్త పెళ్లి కూతురికి షాక్!
బెంగళూరు/ హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి విచారణ ఖైదీలుగా జైలు జీవితం గడిపిన ఇద్దరు టాప్ హీరోయిన్లతో పాటు ఈ కేసులో అరెస్టు అయన నిందితులకు ఇప్పుడు అసలు సిసలైన సినిమా కష్టాలు ఎదురైనాయి. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ రిపోర్టుతో హీరోయిన్లతో పాటు అందరూ డ్రగ్స్ సేవించారని వెలుగు చూసిందని క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమీషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ఇద్దరు హీరోయిన్లతో పాటు ఆర్ టీఓ మాజీ అధికారి, వ్యాపారవేత్తలు ఈ కేసులోని ప్రముఖ నిందితులకు ఇప్పుడు షార్వా కారిపోతావుందని వెలుగు చూసింది. హీరోయిన్లు రాగిణి, కొత్త పెళ్లి కూతురు సంజనాతో పాటు ఈ కేసులో ప్రముఖ నిందితులు అందరూ డ్రగ్స్ సేవించారని హైదరాబాద్ ఫోరెన్సిక్ రిపోర్టుతో వెలుగు చూసిందని క్రైమ్ బ్రాంచ్ విభాగం అడిషనల్ పోలీసు కమీషనర్ సందీప్ పాటిల్ మంగళవారం మీడియాకు చెప్పారు.

హీరోయిన్లు రాగిణి, సంజనా
స్యాండిల్ వుడ్ ప్రముఖ హీరోయిన్లు, బహుబాష సినిమాల్లో నటించిన రాగిణి ద్వివేది, సంజనాలు గత సంవత్సరం డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విచారణ ఉన్న సమయంలోనే స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు తెర మీదకు రావడంతో గత ఏడాది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

అక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగింది
గత ఏడాదిలో బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారులకు స్యాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలిసింది. ఎన్ సీబీ అధికారులు సమాచారం ఇవ్వడంతో బెంగళూరులోని బాణసవాడి పోలీసులు రంగంలోకి దిగారు. బాణసవాడి పోలీసుల చేతి నుంచి కేసు అప్పట్లోనే (2020) బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారుల చేతికి వెళ్లిపోయింది.

నటి రాగిణికి ఫుల్ స్క్రీన్ సినిమా
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మొదట బెంగళూరులోని జయనగర ఆర్ టీఓ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న రవిశంకర్ ను అరెస్టు చేశారు. రవిశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు స్యాండిల్ వుడ్ టాప్ హీరోయిన్ రాగిణి దివ్వేది అరెస్టు అయ్యారు. ఆసమయంలో రవిశంకర్, హీరోయిన్ రాగిణి దివ్వేది ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ డీలర్ల మీద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పంజా విసిరారు.

హీరోయిన్ సంజనాకు ఎఫెక్ట్
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కాటన్ పేట పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయ్యింది. పోలీసులు స్యాండిల్ వుడ్ కు చెందిన మరో హీరోయిన్, ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజనాను అరెస్టు చేశారు. నటి సంజనాతో పాటు అదే సమయంో రాహుల్ తోన్సే లూయిమ్ పెప్పర్, వివేక్ ఖన్నా తదితరులను అరెస్టు చేశారు.

రక్తపరీక్షలు, తల వెంట్రుకల స్యాంపిల్స్
పోలీసులు అరెస్టు చేసిన సమయంలో హీరోయిన్లు రాగిణి, సంజనాతో పాటు ఈ కేసులోని నిందితులు అందరూ తాము డ్రగ్స్ సేవించలేదని పదేపదే మొత్తుకున్నారు, అయితే పోలీసులు రాగిణి, సంజనాతో పాటు అందరికి రక్త పరీక్షలు నిర్వహించారు. అందరి తల వెంట్రుకలు సేకరించి హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. రక్త పరీక్షలు, వివిద పరీక్షలు చేసే సమయంలో నటి రాగిణితో పాటు సంజనా తదితరులు నానా హంగామా చెయ్యడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

అవును.... హీరోయిన్లతో పాటు అందరూ డ్రగ్స్ సేవించారు
హీరోయిన్లు రాగిణి దివ్వేది, సంజానా, వీరేన్ ఖన్నా, రవిశంకర్, రాహుల్ తదితరులు పక్కాగా డ్రగ్స్ సేవించారని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షలలో వెలుగు చూసింది. మేము డ్రగ్స్ సేవించలేదు కావాలనే మా మీద తప్పుడు కేసులు నమోదు చేశారని ఇంతకాలం డబ్బా కొట్టుకున్న హీరోయిన్లు సంజనా, రాగిణి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థంకాక గిలగిలా కొట్టుకునే పరిస్థితి ఎదురైయ్యింది.

సీసీబీ చరిత్రలో ఫస్ట్ టైమ్
డ్రగ్స్ సేవించిన వారికి మామూలుగా రక్త పరీక్షలు చేసి వారు డ్రగ్స్ సేవించారా ?, లేదా ? అని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్దారించుకుంటున్నారు. అయితే డ్రగ్స్ సేవించిన 48 గంటల్లో అయితేనే రక్తపరీక్షల్లో వారు డ్రగ్స్ సేవించారా ?, లేదా ? అని కచ్చితంగా తెలుస్తుంది. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మొదటిసారి తల వెంట్రుకలు సేకరించి వారు డ్రగ్స్ సేకరించారా ? లేదా ? అనే విషయం కచ్చితంగా నిర్దారించుకోవడంతో కథ రసవత్తరంగా మారిపోయింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దెబ్బతో ఇంతకాలం డ్రగ్స్ సేవిస్తూ స్యాండిల్ వుడ్ లో చలామణి అయిన రాగిణి దివ్వేది, సంజనాతో పాటు తదితరులకు సినిమా కనిస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు.

హీరోయిన్లకు 70 ఎంఎం, త్రీడీ సినిమాలు
బెయిల్ మీద బయటకు వచ్చిన సమయంలో రాగిణి, సంజనా వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ మేము ఏ తప్పు చెయ్యలేదని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని పదేపదే మీడియా ముందు చెప్పారు. అయితే ఇప్పుడు ఫోరెన్సిన్ నివేదికలో హీరోయిన్లు రాగిణి, సంజనా తదితరులు డ్రగ్స్ సేవించారని పక్కాగా వెలుగు చూడటంతో వారి మైండ్ బ్లాక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో నేరం రుజువు అయితే అందరికీ కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇటీవలే వేరే మతం వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంజనా పరిస్థితి ఎలా ఉంటుందో అనే విషయం అంతుచిక్కడం లేదని ఆమె అభిమానులు అంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications