వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులకు భారతే కారణమంటూ లేఖ, మోడీపై రాహుల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘనలకు భారతే కారణమని పాకిస్దాన్, ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారుడు సర్తాజ్ అజీజ్ ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్‌కు లేఖ రాశారు.

‘‘గడచిన వారం రోజులుగా నియంత్రణ రేఖ వెంట భారత సైన్యం, కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలిస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఈ కారణంగానే సరిహద్దు వెంట ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నానాటికీ ఇక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇక్కడున్న పరిస్దితుల గురించి భద్రతా సమతిలో పెట్టడం ద్వారా సమస్యకు పరిషస్కారం చూపించండి'' అంటూ సర్తాజ్ అజీజ్ ఆ లేఖలో బాన్-కీ-మూన్‌ను పేర్కొన్నాడు.

Sartaj Aziz informs UN chief of India's ceasefire violations

ఇది ఇలా ఉంటే శనివారం రాత్రి జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్‌లో అంతర్జాతీయ సరహద్దు వెంబడి ఉన్న తమ ఔట్ పోస్టులపై పాక్ బలగాలు కాల్పులకు పాల్పడ్డ బీఎసఎప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత్ - పాక్ దళాల మధ్య చాలా సేపు కాల్పులు కొనసాగాయని అన్నారు.

అంతర్జాతీయ సరిహద్దులో ఉద్రిక్తతకు కారణమవుతున్న పాకిస్దాన్, చైనా బలగాల చర్యలను నివారించడంలో ప్రధాని మోడీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల సమయంలో మోడీ హామీలతో ఊదరగొట్టారని.. తీరా ప్రధాని అయ్యాక ఏమీ పట్టనట్టు వ్వవహరిస్తున్నారన్నారు.

అన్నీ సర్దుకుంటాయని దేశ ప్రజలకు ప్రధానీ మోడీ హామి ఇచ్చిన పాకిస్దాన్ సైన్యం దాడులకు తెగబడుతుందన్నారు.

English summary

 As tension along the border between Pakistan and India escalates, Advisor to the Prime Minister on National Security and Foreign Affairs Sartaj Aziz wrote a letter to UN Secretary General Ban Ki-moon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X