Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పన్నీర్‌పై శశికళ వ్యూహం: ఎవరీ పళనిస్వామి?

పన్నీరు సెల్వంకు బద్ద వ్యతిరేకి అయిన పళనిస్వామి పేరును శశికళ తెర మీదికి తేవడంలో పకడ్బందీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పళనిస్వామి శశికళకు నమ్మినబంటు కూడా..

చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనకు శిక్ష పడితే తన స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే విషయంలో అన్నాడియంకె చీఫ్ శశికళ ముగ్గురు నేతల పేర్లను ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆమెను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసిన తర్వాత పళనిస్వామి పేరు తెర మీదికి వచ్చింది. పళని స్వామిని తెర మీదికి తేవడంలో శశికళ పన్నీర్ సెల్వం ఆశలపై నీళ్లు చల్లినట్లు భావిస్తున్నారు.

తనకు అత్యంత విధేయుడైన పళని స్వామి శాసనసభా పక్ష, నేతగా ఎన్నికయ్యే విధంగా శశికళ జాగ్రత్తలు తీుకున్నారు. తీర్పు రావడమే తరువాయి ఏ మాత్రం జాప్యం చేయకుండా శశికళ చక్రం తిప్పారు. ప్లాన్ బీని అమలు చేయడంలో అత్యంత వేగంగా కదిలారు.

విషాదం: చిన్నమ్మ పాట ఇదే..

తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ పళని స్వామి తనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల సంతకాలతో గవర్నర్‌కు ఫాక్స్ పంపించారు. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ కోరి గవర్నరును కలిశారు. పళనిస్వామి పన్నీరు సెల్వంకు పార్టీలో బద్ధ వ్యతిరేకి. అదే పన్నీరు సెల్వంకు చెక్ పెట్టడానికి శశికళకు ఉపకరించిందని అంటున్నారు.

Sasikala favours: who is Palani Swamy?

పన్నీరు సెల్వం మంత్రివర్గంలో పళనిస్వమి సీనియర్ మంత్రి. రహదారులు, ఓడరేవుల శాఖను నిర్వహిస్తున్నారు. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం నుంచి ఆయన నాలుగు సార్లు అసెంబ్లీకి గెలిచారు. ఆయన 1989లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. జయలలితకు ఆయన వీరవిధేయుడిగా ఉంటూ వచ్చారు. అదే సమయంలో చిన్నమ్మకు కూడా నమ్మిన బంటు.

జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని శశికళ భావించినట్లు సమాచారం. అయితే, అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వం తనకు కూడా విధేయుడిగా ఉంటాడనే కారణంతోనే కాకుండా ప్రజల్లో జయలలిత మెచ్చిన నాయకుడిగా ఉండడంతోపన్నీరుకు పట్టం కట్టినట్లు తెలుస్తోంది.

పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు. పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత పళనిస్వామి శశికళ శిబిరంలో చేరారు. దీంతో శశికళకు ముఖ్యమంత్రి పదవి చేజారడంతో ఆయన పేరు తెర మీదికి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+