శశికళ డ్రామాలు ఆడుతున్నారు, పెరోల్ మీద వచ్చి రాజకీయాలు: జయలలిత మేనకోడలు దీపా !
శశికళ ఆమె భర్త నటరాజన్ డ్రామాలు ఆడుతున్నారుభర్తను చూసుకోవాలని పెరోల్ మీద బయటకు వచ్చి రాజకీయాలుశశికళ మీద విరుచుకుపడిన జయలలిత మేనకోడులు దీపా జయకుమార్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద పగ తీర్చుకోవడానికి శశికళ జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చారని, తన భర్త నటరాజన్ కు ఆరోగ్యం బాగలేదని చెప్పి పెరోల్ మీద బయటకు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు.
శనివారం దీపా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో భర్త నటరాజన్ ను చూసుకోవాలని జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలకు బేరం పెడుతున్నారని దీపా విమర్శించారు. నటరాజన్, శశికళ కలిసి డ్రామాలు ఆడుతున్నారని, తమిళనాడు ప్రజలు అన్ని విషయాలు క్షుణ్ణంగా గమనిస్తున్నారని దీపా చెప్పారు.

మరో వైపు చిన్నమ్మ శశికళతో భేటీ కావడానికి చెన్నైలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి దగ్గరకు ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సినీ నటి, అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకురాలు సీఆర్. సరస్వతి గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి దగ్గరకు చేరుకుని శశికళతో భేటీ కావడానికి ప్రయత్నించారు.
చెన్నై నగర పోలీసులు సీఆర్. సరస్వతితో పాటు శశికళ వర్గీయులు గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలోకి వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. గత ఏడాది ఇదే రోజు అపోలో ఆసుపత్రి బయట అమ్మ జయలలిత కోసం ఎదురు చూసిన సీఆర్. సరస్వతి ఈరోజు ఇదే సమయానికి గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి దగ్గర చిన్నమ్మ శశికళ కోసం ఎదురు చూస్తున్నారని అన్నాడీఎంకే పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు విమర్శించారు.












Click it and Unblock the Notifications