శశికళకే ఝలక్: చెప్పకుండానే దినకరన్ పోటీనా, మండిపడిన చిన్నమ్మ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు/చెన్నై: జయలలిత ప్రాతినిథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ తీరుపై శశికళ మండిపడుతున్నారని వెలుగు చూసింది.

Sasikala very upset over the announcement of Dinakaran as a Candidate in RK Nagar By Election.

సీఎం పళనిసామి సీరియస్: కమల్ హాసన్ కు అండగా నడిగర్ సంఘం

కనీసం తనతో సంప్రదించకుండానే దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు.

శశికళ వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళను కలిశారు. ఆ సమయంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల విషయంపై చర్చ జరిగిందని సమాచారం. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నుంచి దినకరన్ పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారని శశికళ చెవిలో వేశారు.

సమరానికి సై: తమిళనాడు భారీ బడ్జెట్ ! పదవి ఉంటుందా, ఊడుతుందా

తనకు ఒక్క మాటకూడా చెప్పకుండా, కనీసం సంప్రదించకుండా దినకరన్ సొంతంగా నిర్ణయం తీసుకున్నాడని శశికళ అసహనం వ్యక్తం చేశారని ఆమె వర్గంలోని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు. శశికళ జైలుకు వెళ్లిన నాలుగు రోజుల తరువాత దినకరన్ బెంగళూరు చేరుకుని రెండు రోజులు ఇక్కడే మకాం వేశారు.

ఆ సందర్బంలో రెండు సార్లు జైల్లో శశికళతో మాట్లాడారు. తరువాత దినకరన్ బెంగళూరు సెంట్రల్ జైలు వైపు కన్నెత్తికూడా చూడలేదు. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత దినకరన్ ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైయ్యింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to AIADMK Sources said that Sasikala who was in Bangalore Jail very upset over the announcement of Dinakaran as a Candidate in RK Nagar By Election.
Please Wait while comments are loading...