సుష్మాకు సారీ చెప్పు లేదంటే..: రాహుల్‌కు గడ్కరీ
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను 'క్రిమినల్' అని సంభోదించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేస్తామని గడ్కరీ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
విదేశాంగ మంత్రిని క్రిమినల్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దురదుష్టకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రాహుల్ గాంధీ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.
తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేస్తామని గడ్కరీ హెచ్చరించారు. సుష్మా తన అధికారులను దుర్వినియోగం చేయలేదని తెలిపారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి వీసా జారీ చేయడంలో సుష్మా స్వరాజ్ సాయం చేసినందుకు గాను ఆమెను క్రిమినల్ అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ నేరస్తురాలని రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరపూరిత చర్యకు ఆమె పాల్పడ్డారని, భారత్ గాలిస్తున్న ఓ వ్యక్తి దేశం విడిచి పారిపోయేందుకు సహకరించారని ఆరోపించారు. అందువల్ల ఆమెను మంత్రిపదవి నుంచి తప్పించాల్సిందేనని రాహుల్ గురువారం డిమాండ్ చేశారు.
దీంతో కేంద్రంలో అటు కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లలిత్ మోడీకి సాయం చేసినందుకు గాను సుష్మాస్వరాజ్, రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే, వ్యాపం స్కాంలో శివరాజ్ సింగా చౌహాన్ రాజీనామాలు చేసేంత వరకు పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగేందుకు సహకరించబోమని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications