షాకింగ్ : 'ఏటీఎం'ల పూర్తి స్థాయి కార్యకలాపాలకు మరో 10రోజులు
న్యూఢిల్లీ : సామాన్యుల కొత్త నోట్ల తిప్పలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈరోజు ఉదయాన్నే ఏటీఎంలు తెరుస్తారని అంతా భావించినా.. ఉదయం చాలాసేపటిదాకా పలు ఏటీఎంలు మూసే దర్శనమివ్వడంతో.. చాలామంది తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు బ్యాంకుల్లో విపరీతమైన రద్దీతో పాటు సిబ్బందితో గొడవలు కూడా తలెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించిన ఎస్‌బీఐ ఛైర్మన్.. పూర్తి స్థాయిలో ఏటీఎం కార్యకలాపాలు అందుబాటులోకి రావాలంటే మరో 10రోజులు ఆగాల్సిందేనని చెబుతున్నారు. మరికొన్ని బ్యాంకులు అధికారులు కూడా దీనిపై స్పందించారు. మరో రెండు రోజుల్లో కొత్త నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని.. ఆ తర్వాతే ఏటీఎంలలో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా, పలుచోట్ల సాంకేతిక సమస్యలతో ఏటీఎంలు పనిచేయకపోవడం కూడా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది.













Click it and Unblock the Notifications