విద్యార్థిని ప్రాణం తీసిన అశ్లీల ఫేస్‌బుక్ పోస్ట్
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో తన పేరిట తోటి విద్యార్థి అశ్లీల పోస్టులు పెట్టడంతో మనస్తాపం చెందిన ఓ పాఠశాల విద్యార్థిని(14) భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనకు కారణమైన ఆమె క్లాస్‌మేట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె పాఠశాలకు వెళుతున్న సమయంలో నిందిత విద్యార్థి ఆమెను వేధించాడని గతంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అతన్ని పోలీసు స్టేషన్‌కు పిలిచి మందలించి పంపించారు. దీంతో బాలికపై పగ పెంచుకున్న ఆ అబ్బాయి.. ఫేస్‌బుక్‌లో బాలిక పేరిట ఓ నకిలీ అకౌంట్‌ను సృష్టించాడు. ఆ అకౌంట్‌లో అశ్లీలమైన పోస్టులు పెట్టాడు.
ఈ విషయం తెలియడంతో మనస్తాపం చెందిన బాలిక అక్టోబర్ 20న తన అపార్ట్‌మెంట్ మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ కేసులో బాలుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. అతడు మైనర్ కావడంతో జువెనైల్ హోంకు తరలించారు.












Click it and Unblock the Notifications