చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై జలమయం: 55 వేల మంది క్షేమం (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

చెన్నై: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు, కాంచీపురం, తిరువళ్లారు జిల్లాలు జలమయం అయ్యాయి, చెరువుల్లో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. మూడు జిల్లాల్లో 165 చెరువులకు గండ్లు పడ్డాయి.

చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లారు జిల్లాల్లో వేలాధి ఇండ్లు నీట మునిగిపోయాయి. దినసరి కూలీలుగా పని చేస్తూ అప్పటికప్పుడు డబ్బు సంపాధించుకుని పొట్టపోసుకునే కార్మికులు ఆహారం అందక ఆర్తనాదాలు చేస్తున్నారు.

ముంపుకు గురైన మూడు జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. ఆరు హెలికాప్టర్లతో సుమారు 70 మంది సిబ్బంది, 10 మంది అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. హెలికాప్టర్ల ద్వార ఆహారపొట్లాలు, వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 55 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పిల్లలకు తిండిలేక ఆర్తనాదాలు

పిల్లలకు తిండిలేక ఆర్తనాదాలు

కార్మికులు, దినసరి కూలీలు, కూరగాయల మార్కెట్లలో పని చేసే వారు వారి పిల్లలకు ఆహారం పెట్టలేక విలపిస్తున్నారు.

సైనం అందించే ఆహారం కోసం ఎదురు చూపులు

సైనం అందించే ఆహారం కోసం ఎదురు చూపులు

సైన్యం హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారం, వాటర్ బాటిల్స్ కోసం పేదలు, కార్మికులు ఎదురు చూస్తున్నారు.

బోట్లలో రక్షిస్తున్నారు

బోట్లలో రక్షిస్తున్నారు

జలమయం అయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని విపత్తు నిర్వహణా విభాగం అధికారులు బోట్ల సహాయంతో రక్షిస్తున్నారు.

ఎక్కడి వాహనాలు అక్కడే

ఎక్కడి వాహనాలు అక్కడే

నీటిలో మునిగిపోయిన అనేక వాహనాలు ఎక్కడపడితే అక్కడే ఉన్నాయి. పలు చోట్ల క్రేన్ ల సహాయంతో కొన్ని వాహనాలు బయటకు తీశారు.

షాక్ లో ఉన్న చెన్నై ప్రజలు

షాక్ లో ఉన్న చెన్నై ప్రజలు

చెన్నై నగరంలోని లోతట్టు ప్రాంతాలు, మురికివాడలలో నివాసం ఉంటున్న ప్రజలు ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.

నిత్యవసర వస్తువులు నీటిపాలైనాయి

నిత్యవసర వస్తువులు నీటిపాలైనాయి

పేదలు ఎక్కువగా నివాసం ఉంటున్న చోట నీట మునిగి ఆహారధాన్యాలు, నిత్యవసర వస్తువులు తడిసి ముద్ద అయ్యాయి.

అన్నం పెట్టండి

అన్నం పెట్టండి

సహాయం చెయ్యడానికి వెళ్లిన అధికారులకు మొదట మా బిడ్డలకు అన్నం పెట్టండి అని స్థానికులు వేడుకుంటున్నారు.

అత్యవసర సహాయక చర్యలు

అత్యవసర సహాయక చర్యలు

చెన్నై నగరం నీట మునగడంతో అనేక మంది చిక్కుల్లో పడ్డారు. వారిని రక్షించడానికి అత్యవసర సహాయక చర్యలు చేపడుతున్నారు.

పిల్లలు, వృద్దులు, మహిళలు

పిల్లలు, వృద్దులు, మహిళలు

పిల్లలు, వృద్దులు, మహిళలను క్షేమంగా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇంకా వర్షాలు

ఇంకా వర్షాలు

ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో చెన్నై నగర ప్రజలు హడలిపోతున్నారు.

చలికి హడలిపోతున్నారు

చలికి హడలిపోతున్నారు

పిల్లలు, వృద్దులు చలికి తట్టుకోలేక హడలిపోతున్నారు. భారీ వర్షాలకు ఈదురుగాలులు ఎక్కువ అయ్యాయి. అనేక చోట్ల చెట్లు నేలమట్టం అయ్యాయి.

అందకారంలో

అందకారంలో

చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్థంభాలు నేలమట్టం కావడంతో పలు ప్రాంతాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి.

English summary
The toll in rain-related incidents across Tamil Nadu on Tuesday touched 79 with eight more deaths reported from three districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X