జమ్ము కాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. చివరి నిమిషంలో!!

జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌లో గత ఏడాది చోటు చేసుకున్న భయానక ఉగ్రవాద దాడి అనంతరం అక్కడ శరవేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని తరువాత భద్రత బలగాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న నియంత్రణ రేఖ వెంబడి గస్తీని ముమ్మరం చేశాయి. నిఘా పెంచాయి. అన్ని సెక్టార్‌లలో అదనపు పారా మిలటరీ బలగాలు, బీఎస్ఎఫ్ జవాన్లను మోహరింపజేశారు. ఉగ్రవాదుల వేట సాగుతోంది.

ఈ క్రమంలో తాజాగా కిష్తవార్ జిల్లాలో భారీగా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు హోరాహోరీగా జరుగుతున్నాయి. జిల్లాలోని ఛత్రు ప్రాంతంలోని మంద్రల్-సింగూరా సమీపంలో ఉగ్రవాదులు మాటు వేసినట్లు పక్కా సమాచారం అందింది. దీంతో భారీ సంఖ్యలో భద్రత బలగాలు అక్కడికి బయలుదేరి వెళ్లాయి. ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

Security forces encounter with Terrorists in Kishtwar forest area Jammu and Kashmir

ఈ రీజియన్ లోని సోనార్ గ్రామంలో ఈ మధ్యాహ్నం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులను చుట్టుముట్టారు. దీంతో ఉగ్రవాదులు భద్రత బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీనికి ప్రతిస్పందనగా భద్రత బలగాలు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్ కౌంటర్ జరుగుతున్న విషయాన్ని ఆర్మీ అధికారులు నిర్ధారించారు. మంద్రల్-సింగూరా సమీపంలోని సోనార్ వద్ద ఈ ఎన్ కౌంటర్ ఆరంభమైనట్లు తెలిపారు.

సరిహద్దు భద్రత బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఈ గాలింపు చేపట్టాయని, వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని అధికారులు చెప్పారు. దీనికి ప్రతిగా భద్రతా బలగాలు వెంటనే ఎదురు కాల్పులు జరుపుతున్నాయని అన్నారు. ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారనేది తెలియరావట్లేదని, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందే ఉండొచ్చిని అనుమానిస్తోన్నారు. దీంతో అదనపు బలగాలను సంఘటన స్థలానికి రప్పించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు కరడుగట్టిన జైషే మొహమ్మద్ (జేఈఎం) గ్రూప్ కు చెందినవాళ్లై ఉండొచ్చని ఆర్మీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాళ్లు ఎంతమంది ఉన్నారు? ఏ సంస్థకు చెందిన వాళ్లనేది ఇంకా అధికారిక నిర్ధారణ ఇంకా రాలేదు. కాల్పుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఆపరేషన్ పురోగమిస్తున్న కొద్దీ తదుపరి వివరాలను వెల్లడిస్తామని భద్రతా ఏజెన్సీలు ప్రకటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+