న్యూ ఇయర్ వేడుక జోష్: హై అలర్ట్, బెంగళూరులో కొత్త టెక్నాలజీ

హైదరాబాద్/విశాఖ: కొత్త సంవత్సరం వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. మరోవైపు, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

ఐబీ (ఇంటెలిజన్స్ బ్యూరో) హెచ్చరికల నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేశారు. నగరంలో పోలీసులను భారీగా బందోబస్తుకు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకే న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని పోలీసులు చెబుతున్నారు. పీవీ ఎక్స్‌ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులను మూసివేశారు.

విశాఖలో జరిగే నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. వేడుకలను ఆర్కే బీచ్ వద్ద యువత ప్రతి ఏటా జరుపుకుంటుంది. బీచ్ వద్దకు ఇసుక వేస్తే రాలనంత జనం వస్తోంది. ఈ వేడుకలో ఎలాంటి అపశృతి దొర్లకుండా ఉండేందుకు అధికారులు ఆంక్షలు విధించారు.

ఆర్కే బీచ్ దారిలో రాత్రి ఎనిమిది గంటల నుండి వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ బీచ్ రోడ్డులో త్రిబుల్ రైడింగును నిషేధించారు. బీచ్ రోడ్డులో బాణసంచా కాల్చడం నిషేధించారు. నగరంలోని హోటళ్లలో వేడుకలు ఒంటి గంట వరకే జరుపుకోవాలని సూచించారు. బైకుల పైన ఫీట్లు చేయవద్దని సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం హంగామా. 2014కు వీడ్కోలు పలుకుతూ... 2015కు స్వాగతం పలికేందుకు ముంబైలో ఆటాపాటలతో ముంబై సెలెబ్రటీలు..

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం హంగామా. 2014కు వీడ్కోలు పలుకుతూ... 2015కు స్వాగతం పలికేందుకు ముంబైలో ఆటాపాటలతో ముంబై సెలెబ్రటీలు..

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం హంగామా. 2014కు వీడ్కోలు పలుకుతూ... 2015కు స్వాగతం పలికేందుకు ముంబైలో ఆటాపాటలతో ముంబై సెలెబ్రటీలు..

కొత్త సంవత్సరం

కొత్త సంవత్సరం

2014కు వీడ్కోలు పలుకుతూ... 2015కు స్వాగతం పలికేందుకు సిద్దమైన సిడ్నీలోని ఓపేరా హౌస్ అండ్ హార్బర్ బ్రిడ్జ్ దృశ్యం.

తిరుమల

తిరుమల

కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రంలోని పలు దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశితో పాటు నూతన సంవత్సరం నేపథ్యంలో తిరుమల క్యూలైన్లు నిండిపోయాయి. తిరుమల భక్తజన సంద్రమైంది.

ఏడాది చివరి సన్ సెట్!

ఏడాది చివరి సన్ సెట్!

2014కు వీడ్కోలు పలుకుతూ.. 2015కు స్వాగతం పలికేందుకు సిద్ధమైన యువత.. శ్రీనగర్‌లో దాల్ లేక్ వద్ద సన్ సెట్‌ను ఆసక్తికరంగా చూస్తున్న దృశ్యం.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో బెంగళూరు పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు బెంగళూరు పోలీసులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించనున్నారు. నాలుగు రోజుల క్రితం బెంగళూరులో బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు వినియోగిస్తారు. మరోవైపు, తిరుమలతో పాటు దేవాలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+