G20 summit: జో బైడెన్ కారు డ్రైవర్‍ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది..
భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమావేశాలు ముగిశాయి. ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదంతో భారత్ జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించింది. అయితే జీ2- సమావేశంలో భద్రతా నిర్వహిస్తున్న సిబ్బంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రోటాకోల్ కు విరుద్ధంగా కారు నడిపినందుకు అతడిని భద్రతా సిబ్బంది ప్రశ్నించారు. బైడెన్ కాన్వాయ్ లో ఓ కారు డ్రైవర్ కారును యూఏఈ అధ్యక్షుడు బస చేసే తాజ్ హోటల్ కు తీసుకెళ్లాడు.
దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు బైడెన్ నివాసముండే మౌర్య హోటల్ కు వెళ్లాలని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. తనకు ప్రోటోకాల్స గురించి తెలియదని పేర్కొన్నరాడు. దీంతో డ్రైవర్ ను విడిచి పెట్టాడు. అయితే అతను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు బైడెన్ కాన్వాయ్ నుంచి అతన్ని తొలగించారు. జీ20 సదస్సులో పాల్గొనేందుక అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.

శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం సదస్సులో పాల్గొన్న బైడెన్ రాత్రి రాష్ట్రపతి ఇచ్చిన డిన్నర్ కు వచ్చారు. బైడెన్ ఆదివారం ఉదయం రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా వియత్నాంకు వెళ్లారు. భారత్ లో విజయవంతంగా జీ20 సమావేశాలు ముగియడంతో తదుపరి సమావేశ అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు.
ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి ఇచ్చారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోడీ వెల్లడించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'కు సంబంధించి విజన్‌పై చేస్తోన్న కృషికి జీ20 ఓ వేదికగా మారడంతో తనకెంతో సంతృప్తి లభించిందని మోడీ చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని మోడీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications