Sexual harrasment: డ్యాన్స్ బాబా లైంగిక దాడి కేసు, సార్ క్రిష్ణుడు, విద్యార్థినిలు గోపికలు, అబ్బా !
చెన్నై: స్కూల్ లో చదువుతున్న మైనర్ అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబా అలియాస్ డ్యాన్స్ బాబా అలియాస్ శివశంకర్ కు సినిమా కష్టాలు ఎదురైనారు. ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రంలో తనకు గుండెపోటు వచ్చిందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫోక్సో చట్టం కింద ఐదు కేసులు నమోదు కావడంతో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి శివశంకర బాబా నాటకాలు ఆడుతున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. స్థానిక పోలీసులు శివశంకర్ బాబాతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. కేసు సీబీసీఐడికి అప్పగించడంతో ఇప్పుడు డ్యాన్స్ బాబాను అరెస్టు చెయ్యడానికి డెహ్రాడూన్ కు పోలీసులు వెళ్లారు.
స్కూల్ అమ్మాయిలు గోపికలు, నేను శ్రీక్రిష్ణుడు అంటూ ఇంతకాలం వారితో ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసిన బాబాకు ఇప్పుడు సినిమా కనపడుతోంది.
Recommended Video

ఇంటర్నేషనల్ స్కూల్
చెన్నై సమీపంలోని కేలంబాక్కంలో శంకర్ బాబా ఆధ్వర్యంలో సుశీల్ హరి ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్నారు. ఇదే స్కూల్ లో వందలాది మంది అమ్మాయిలు, అబ్బాయిలు చదువుతున్నారు. స్కూల్ లోనే ఉంటున్న శివశంకర్ బాబా అలియాస్ డ్యాన్స్ బాబా అమ్మాయిలతో ఎక్కువ చనువుగా ఉంటున్నాడని తెలిసింది.

అమ్మాయిలు గోపికలు...... డ్యాన్స్ బాబా శ్రీక్రిష్ణుడు ?
ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ లో వందలాది మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు. అమ్మాయిలను గోపికలతో పోల్చుతూ వారితో కలిసి డ్యాన్స్ చేస్తున్న శవశంకర్ బాబా వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు రావడంతో పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఆధ్యాత్మిక పర్యటన అంటూ ఎస్కేప్
గతంలో పంచాయితీ పరిధిలో ఉన్న సమయంలో శివశంకర్ బాబా చేస్తున్న డ్యాన్స్ లు చూసిన స్థానికులు ఆయన్ను డ్యాన్స్ బాబా అని పిలిచేవాళ్లు. స్కూల్ లో విద్యార్థినిలు (అమ్మాయిలు) మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసులు నమోదు చేసిన పోలీసుుల విచారణకు హాజరుకావాలని డ్యాన్స్ బాబాకు సమన్లు పంపించారు. సమన్లు రావడం మొదలు కావడంతో శివశంకర్ బాబా ఆధ్యాత్మిక పర్యటన అంటూ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేసి ఎస్కేప్ అయ్యాడు.

గుండెపోటు అంటూ డెహ్రాడూన్ ఆసుపత్రిలో తిష్ట
కేలంబాక్కం పోలీస్ స్టేషన్ లో శివశంకర్ బాబా అలియాస్ డ్యాన్స్ బాబా మీద ఫోక్సో చట్టంతో సహ మొత్తం ఐదు సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో కేసును సీబీసీఐడికి అప్పగించారు. గుండెనోప్పి అంటూ శివశంకర్ బాబా డెహ్రాడూన్ ఆసుపత్రిలో చేరాడని సమాచారం అందుకున్న తమిళనాడు సీబీసీఐడీ పోలీసు అధికారులు ఇప్పటికే డెహ్రాడూన్ బయలుదేరి వెళ్లారు.

ప్రముఖ స్కూల్స్ లో లైంగిక వేధింపులు !
డెహ్రాడూన్ లో డ్యాన్స్ బాబాను అరెస్టు చేసి చెన్నై తీసుకురావాలని తమిళనాడు పోలీసులు డిసైడ్ కావడంతో డ్యాన్స్ బాబా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది. ఇప్పటికే చెన్నైలోని పద్మ శేషాద్రి స్కూల్ టీచర్లు ఇద్దరు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేశారని వెలుగు చూడటంతో ఇద్దర్ని అరెస్టు చేశారు. స్కూల్ టీచర్లను రక్షించడానికి ప్రయత్నించారని యాజమాన్యం మీద ఆరోపణలు రావడంతో ఇప్పుడు అందరూ విచారణ ఎదుర్కొంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications