Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎంతో సీక్రేట్ గా సమావేశం అయిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ఏం జరుగుతోంది ?

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ జోరుగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారనే ఊహాగానాల మధ్య ఈ ఇద్దరి కలయికతో బీజేపీ నాయకుల మైండ్ బ్లాక్ అయ్యింది.

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్టీ సోమశేఖర్ ఆదివారం రాత్రి బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమై అరగంటకు పైగా చర్చలు జరిపారు. బెంగళూరు నగరంలోని యశ్వంతపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశానని బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ. సోమశేఖర్ తెలిపారు.

Senior BJP MLA ST Somasekhar held talks with Karnataka CM Siddaramaiah alone in Bengaluru.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బెంళూరు నగరంలోని యశవంతపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి మరోసారి ఎమ్మెల్యేా ఎన్నికైన ఎస్‌టి సోమశేఖర్ కొద్ది రోజుల క్రితం తన నియోజకవర్గానికి చెందిన కొంతమంది బీజేపీ నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమశేఖర్ దెబ్బతో బీజేపీ నాయకుల మధ్య తేడాలు వచ్చాయని వెలుగు చూసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించడానికి కుట్ర పన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ. సోమశేఖర్ బహిరంగంగానే ఆరోపించారు. రెండు రోజుల క్రితం బీజేపీ నేత, మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప ఇంట్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి సోమశేఖర్‌ గైర్హాజరు కావడం హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్‌ను బుజ్జగించేందుకు యశవంతపురంకు చెందిన బీజేపీ నేతలు ధనంజయ, మారేగౌడలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించారు.

Senior BJP MLA ST Somasekhar held talks with Karnataka CM Siddaramaiah alone in Bengaluru.

ఇటీవల యశవంతపురం నియోజక వర్గంలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సోమశేఖర్‌ తన గురువుగా అభివర్ణించడం హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్‌ ఆపరేషన్‌ను ఎదుర్కొనే వ్యూహాలు తమ పార్టీకి బాగా తెలుసునని, తమ ఎమ్మెల్యేలు ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరరని, వారి మీద మాకు విశ్వాసం ఉందని బీజేపీ నేత, మాజీ మంత్రి సీటీ. రవి అన్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ టీ సోమశేఖర్ మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితమే సీఎం అపాయింట్‌మెంట్ అడిగాను. ఈరోజు రమ్మని చెప్పారు, సీఎం సిద్దరామయ్య సూచనల ప్రకారమే ఈరోజు వచ్చి కలిశాను. ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య నాకు ఏమీ చెప్పలేదని సోమశేఖర్ అన్నారు.

తన ఆఫీసులోని అధికారులతో టచ్ లో ఉండాలని, అన్ని సమస్యలు వారు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని సోమశేఖర్ మీడియాకు చెప్పారు. సీఎం సిద్దరామయ్యకు తాను ఓ వినతి పత్రం ఇచ్చానని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ చెప్పారు. తన మద్దతుదారులు బీజేపీని వీడుతున్నారని, ఆ మద్దతుదారులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని ఆయన అన్నారు. కొందరు కార్పొరేటర్లు వెళ్తున్నారు. జేడీఎస్ వెళ్తోంది. కాంగ్రెస్‌లో ఎవరు చేరాలనుకున్నా వాళ్ల ఇష్టమని, తాను ఏమీ చెప్పలేనని బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+