బాత్రూంలో బాలికపై కేరళలో సీనియర్ల అత్యాచారం

అసౌకర్యానికి, నొప్పికి గురి కావడంతో బాలికను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు ధ్రువీకరించినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు. సీనియర్ విద్యార్థులు ఆమెను బాత్రూంలోకి తీసుూకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ నిమిత్తం కొంత మంది సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు పాఠశాల ఎదుట మంగళవారంనాడు నిరసనకు దిగారు. ఆందోళనకారులను పాఠశాల యాజమాన్యం వీడియో తీయడానికి ప్రయత్నించింది. దాంతో వారు మరింతగా రెచ్చిపోయారు. వారిని పోలీసులు అదుపు చేశారు.
డివైఎఫ్ఐతో పాటు వివిధ సంఘాలను పాఠశాలకు ఊరేగింపు తీశాయి. తమ సంస్థపై బురద చల్లడానికి ఇదంతా చేస్తున్నారంటూ పాఠశాల యాజమాన్యం వాదిస్తోంది. ఆరోపణల వెనక కుట్రను బయట పెట్టడానికి విచారణ జరిపించాలని సిరాజుల్ హుడా ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ కార్యదర్శి పెరోడ్ అబ్దుల్ రెహ్మాన్ సఖాఫీ డిమాండ్ చేశారు.
నవంబర్ 9వ తేదీన సంఘటన గురించి పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారని ఆయన చెప్పారు. 30వ తేదీన జరిగితే ఇంత ఆలస్యం చేశారని, బాలిక కూడా పలువురిపై పొంతన లేని మాటలు చెబుతోందని, పైగా తల్లిదండ్రులు తొలుత వైద్య పరీక్షలకు అంగీకరించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications