పాక్‌పై ఇండియన్ ఆర్మీ దాడి ఎఫెక్ట్: కుప్పకూలిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోకి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటును కట్టడి చేసేందుకు నియంత్రణ రేఖ వద్ద దాడులు కొనసాగుతున్నాయని డీజీఎంవో రణబీర్ సింగ్ వెల్లడించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
నియంత్రణ రేఖ వద్ద దాడులు చేపడుతున్నామని భారత ఆర్మీ గురువారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన పడింది. మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.

మార్కెట్ ఆరంభంలో లాభాలతో ట్రేడ్ అయినప్పటికీ సైనికాధికారుల ప్రకటనతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ భారీగా పతనమైంది. నిఫ్టీ 8600 దిగువకు పడిపోయింది. ఒంటిగంట ప్రాంతంలో సెన్సెక్స్ 432 పాయింట్లకు పైగా, నిఫ్టీ 137 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్ అయ్యాయి.












Click it and Unblock the Notifications