• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీరియల్ కిల్లర్.. నెలలో ముగ్గురు మహిళలను ముక్కలుగా నరికి; పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!!

|
Google Oneindia TeluguNews

ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యంత పాశవికంగా ముగ్గురు మహిళలని హతమార్చిన సీరియల్ కిల్లర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు . బెంగళూరులోని హెబ్బగోడి, చిత్రదుర్గలోని హోసదుర్గం, చామరాజనగర్ పట్టణంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు మహిళల హత్యలకు పాల్పడ్డారని ఆగస్టు 3న దొబ్బాస్‌పేటకు చెందిన ఓ వ్యక్తి , అతని భాగస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులకు పెను సవాల్ విసిరిన వరుస హత్య కేసులు

పోలీసులకు పెను సవాల్ విసిరిన వరుస హత్య కేసులు


జూన్ 7న, ఇద్దరు మహిళల మొండాలను పోలీసులు కనుగొన్నారు. ఒకటి పాండవపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని బేబీ కాలువలో మరియు రెండవది ఆరెకెరె పిఎస్ పరిధిలోని సిడిఎస్ కాలువలో రెండు మృతదేహాల మొండాలను పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో బాధితులు మరియు నిందితుల గుర్తింపు కోసం పోలీసులు వేట సాగించారు. ఈ సీరియల్ మర్డర్ కేసులు పోలీసులకు పెనుసవాల్ విసిరాయి.

క్లూస్ లేకుండా సీరియల్ కిల్లింగ్స్..హత్య కేసులపై పోలీసుల విచారణ

క్లూస్ లేకుండా సీరియల్ కిల్లింగ్స్..హత్య కేసులపై పోలీసుల విచారణ

జూన్ 7న హత్య గావించబడిన ఒక మొండెం కనిపించిన తరువాత మాండ్య పోలీసులు తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశారు. మాండ్య జిల్లా మరియు కేరళలో బాధితుల సమాచారం కోరుతూ 10,000 పాంప్లెట్ లను పంపిణీ చేశారు . ఇక డాగ్స్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేశారు. కానీ నేరానికి సంబంధించి ఎటువంటి లీడ్‌లు దొరకలేదు . పోలీసులు మిస్సింగ్ ఫిర్యాదులతో పాటు, అనుమానాస్పద ప్రదేశాలలో సీసీటీవీ ఫుటేజ్ మరియు టవర్ డంప్ అనాలిసిస్ వంటి ఇతర సాంకేతిక డేటాను పరిశీలించారు.

మిస్సింగ్ కేసుల ఆధారంగా దొరికిన క్రిమినల్

మిస్సింగ్ కేసుల ఆధారంగా దొరికిన క్రిమినల్

చామరాజనగర్‌కు చెందిన 32 ఏళ్ల మహిళ జులై 7న మిస్సింగ్ ఫిర్యాదు నుంచి మొదటి లీడ్ దొరికింది. ఆ తర్వాత బెంగళూరులోని అనేకల్ సబ్‌డివిజన్‌లోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ మహిళ మే 2న తప్పిపోయిన మరో ఫిర్యాదు నుంచి రెండో లీడ్ వచ్చింది. బాధితురాలి భర్త దాఖలు చేసిన ఫిర్యాదులో ఆమె సన్నిహితంగా ఉన్న వ్యక్తి పేరును పేర్కొన్నట్లు ఎస్పీ తెలిపారు. దర్యాప్తులో సాంకేతిక ఆధారాల ఆధారంగా, పోలీసులు నిందితుడిని మరియు అతని భాగస్వామిని దొబ్బాస్‌పేట నుండి అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలకు వల.. ఆపై హత్యలు

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలకు వల.. ఆపై హత్యలు


ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మహిళలను పిలిచి, వారిని హతమార్చి వరుస హత్యలకు పాల్పడిన నిందితుడు వారి దగ్గర ఉన్న నగలను దోచుకుని విక్రయించి జల్సాలకు పాల్పడేవాడని పోలీసులు గుర్తించారు. మొదట హెబ్బగోడి నుండి మహిళను మే 1 న ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బెంగుళూరు వెస్ట్‌లోని ఆండ్రహల్లిలోని తన ఇంటికి పిలిపించినట్లు, ఆపై రాత్రి ఆమెను గొంతు నులిమి హత్య చేసి నగలు దోచుకెళ్లి రూ.90 వేలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై చిత్రదుర్గకు తీసుకెళ్లి సరస్సు బండ్ సమీపంలో హైవే పక్కన పడేశాడు.

 చంపి శరీర భాగాలను ముక్కలుగా నరికి కాలువల్లో..

చంపి శరీర భాగాలను ముక్కలుగా నరికి కాలువల్లో..


మే 30న చిత్రదుర్గ నుంచి మైసూరులోని మేటగహళ్లిలోని తన నివాస స్థలానికి ఉద్యోగం సాకుతో రెండో బాధితురాలిని పిలిచి ఆపై హత్య చేశాడు. ఆమె గొంతు నులిమి చంపి, కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత అతను శరీర భాగాలను రెండు సంచుల్లో నింపి, వాటిని గుర్తించకుండా పువ్వులు మరియు ఆకు కూరలతో పాటు సంచుల్లో నింపి, ఆ తర్వాత బ్యాగులను ఒకటి కావేరి నదిలో, మరొకటి సీడీఎస్ కాలువలో విసిరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధితురాలి నగలను రూ.25 వేలకు విక్రయించినట్లు వారు తెలిపారు. ఇక నేరస్థుడు చామరాజనగర్‌కు చెందిన మహిళను జూన్ 3న మైసూరుకు పిలిచాడు. ఆపై ఆమెను కూడా హతమార్చి అతను ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా కట్ చేసి రెండు సంచుల్లో పడేశాడు. ఒకటి కేఆర్‌ఎస్‌ సమీపంలోని కట్టేరి కాలువలో, మరొకటి బేబీ కాలువలో పడేశాడు. అతను ఆమె నగలను రూ. 90,000కి విక్రయించినట్లు సమాచారం.

క్రిమినల్ హిట్ లిస్ట్ లో ఇంకా మహిళలు

క్రిమినల్ హిట్ లిస్ట్ లో ఇంకా మహిళలు


అతను తదుపరి తనకు హత్యలు సహాయం చేసిన మరో నిందితుడు కూడా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 3న, మర్డర్ చేసిన వ్యక్తి మూడు హత్యలకు సాక్షి అయినందున అతనితో కలిసి నేరాలలో పాలుపంచుకున్న మరో వ్యక్తిని చంపాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని హిట్-లిస్ట్‌లో ముగ్గురు మహిళలతో సహా మరో నలుగురు వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు.

English summary
A serial killer who is killing women by cutting them into pieces without any clues has been caught by the Bengaluru police on the basis of missing cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X