విషాదం: కుప్పకూలిన సున్నపురాయి గని, ఏడుగురు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జగ్దల్‌పూర్ జిల్లాలోని మాలేగావ్‌లో సున్నపురాయి గని కుప్పకూలడంతో ఏడుగురు మరణించారు. శిథిలాల్లో మరో 15 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు.
గనిలో మట్టి తవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా పెళ్లలు విగిపడటంతో బాధితులు అందులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ఐదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Chhattisgarh | Seven people killed while extracting limestone from a mine after it collapsed in the Bastar district pic.twitter.com/20sDD0JEjN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 2, 2022
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏడుగురు వ్యక్తులు మాత్రమే మట్టిని తవ్వుతున్నారు, అయితే ఎవరైనా ఉన్నారేమోననే అనుమానంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు సిబ్బంది తెలిపారు.












Click it and Unblock the Notifications