వ్యాపారంలో నష్టం, విషం సేవించి ఏడుగురి ఆత్మహత్య, ఉమ్మడి కుటంబంలో విషాదం !

అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ఏడుగురు విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని మదురై నగరంలో జరిగింది. విషం సేవిం

చెన్నై: అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ఏడుగురు విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని మదురై నగరంలో జరిగింది. వ్యాపారాల్లో నష్టం రావడంతో చీటీల డబ్బు దారి మళ్లించిన ఆ కుటుంబ సభ్యులు సామూహికంగా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.

మదురై నగరంలోని యాగప్పనగర్ లో కురింజి కుమరన్, వేలుమురుగన్ అనే సోదరులు నివాసం ఉంటున్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. వీరి తల్లి జగజ్యోతి కూడా వారితోనే కలిసి నివాసం ఉంటున్నారు. కురింజి కుమరన్, వేలుమురుగన్ కలిసి జయం అనే నర్సరీ పాఠశాలను నిర్వహిస్తున్నారు.

seven family members committed suicide in Madirai

సంపాదన కోసం వీరు పాఠశాలతో పాటు పలు వ్యాపారాలు చేస్తూ చీటీల పాటలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లో నష్టం రావడంతో చీటీల డబ్బు ఖర్చు చేసుకున్నారు. చీటీల గడువు తీరినా చీటీలు వేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో వారి నుంచి ఒత్తిడి ఎక్కువ అయ్యింది.

అప్పులు ఇచ్చిన వారు, చీటీల ఖాతాదారులు ఒత్తిడి చెయ్యడంతో కురంజి కుమరన్, వేలుమురుగన్ జీవితంపై విరక్తి పెంచుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వీరు నివాసం ఉంటున్న ఇంటిలోనే 8 మంది కుటుంబ సభ్యులు ఒకే గదిలో విషం సేవించారు. స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గంట తరువాత అంబులెన్స్ రావడంతో అప్పటికే ఏడుగురు సంఘటనా స్థలంలో మరణించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+