Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్: సార్వత్రికి ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం ఉదయం నారాయణ్​‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ ఘటన జరిగింది. ఎదురుకాల్పులు జరిగిన స్థలంలో నక్సలైట్ల మృతదేహాలతోపాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు నారాయణ్​‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దంతెవాడ, నారాయణ్​‌పూర్, బస్తర్ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సభ్యులు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులు కలిసి గురువారం గాలింపు చర్యలు చేపట్టారు.

Seven maoists killed in encounter with security personnel in Chhattisgarh state

గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇరు వర్గాలు పరస్పరం ఎదురుపడడం కాల్పులకు దారితీసింది. ఐదు గంటల పాటు సాగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్టన్లు తెలిపారు.

గురువారం సాయంత్రం నారాయణ్​‌పూర్​ ఎస్​పీ ప్రభాత్ కుమార్ ఎదురుకాల్పుల ఘటనపై మాట్లాడారు. వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతుండగా ఉదయం 11 గంటలకు కాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టు యూనిఫాంలో ఉన్న ఏడుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఏడు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు.

కాగా, తాజాగా, ఘటనతో కలిపి ఛత్తీస్‌గఢ్‌​లో ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్‌​కౌంటర్లలో 112 మంది నక్సలైట్లు మరణించారు. ఏప్రిల్ 30న నారాయణ్​‌పు ర్​, కాంకేర్​ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌​కౌంటర్ జరిగింది. అప్పుడు ముగ్గురు మహిళలు సహా మొత్తం 10 మంది నక్సలైట్లు.. భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇక, మే 10న బిజాపుర్​ జిల్లాలోని పిడియా గ్రామానికి సమీపంలో భద్రతా సిబ్బందికి, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 12 మంది నక్సల్స్ మరణించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+