Fire Accident: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

శుక్రవారం తెల్లవారుజామున 3:05 గంటలకు ముంబై శివారులోని గోరేగావ్ వెస్ట్‌లోని ఏడు అంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. 51 మంది గాయపడ్డారు. అందులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గ్రౌండ్ ఫ్లడ్‌లోని దుకాణాలు, స్క్రాప్ మెటీరియల్, అనేక పార్క్ చేసిన వాహనాలు, మీటర్ క్యాబిన్, రాగ్‌లు, ప్లైవుడ్‌తో పాటు గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇతర వస్తువులు, గృహోపకరణాలతో పాటు తలుపులు, కిటికీలు, ఫర్నీచర్ బుడిదయ్యాయి.

గాయపడిన 40 మందిలో 36 మందిని హిందూహృదయసామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మెడికల్ కాలేజీ (హెచ్‌బిటి) ఆసుపత్రికి పంపగా, 15 మంది కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు. 2006లో మురికివాడల పునరావాస పథకం కింద భవనాన్ని నిర్మించామని.. ఇందులో అగ్నిమాపక వ్యవస్థ లేదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రవీంద్ర అంబుల్గేకర్ తెలిపారు.

Seven people died in a fire in Goregaon West, Mumbai

దాదాపు నాలుగు గంటల తర్వాత ఉదయం 6.54 గంటల ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. ముంబయిలోని గోరేగావ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

"నేను మున్సిపల్ కమీషనర్, పోలీసులతో నిరంతరం మాట్లాడుతున్నాను. జరిగింది దురదృష్టకరం. మరణించిన వారికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుంది. గాయపడిన వారికి ప్రభుత్వం చికిత్స అందజేస్తుంది" అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

ముంబైలోని గోరేగావ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం గురించి తెలిసి చాలా బాధపడినట్లు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
తాము BMC & ముంబై పోలీసు అధికారులతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవనంలోని కుటుంబాలను సమీపంలోని పాఠశాలలో తాత్కాలిక నివాసానికి తరలించినట్లు ఎమ్మెల్యే ఠాకూర్ తెలిపారు. "విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో మేము సహాయం చేస్తాము. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అని అన్నారు.

ఈ ప్రమాదంపై మురికివాడల పునరావాస అథారిటీ, మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, అగ్నిమాపక అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదికను సమర్పించనున్నట్లు మంత్రి లోధా తెలిపారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయిని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+